క్రైమ్/లీగల్

ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, ఏప్రిల్ 22: కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో శనివారం రాత్రి గోదావరి నదిలో స్నానానికై దిగి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు ఆదివారం గోదావరి నదిలో లభ్యమైనట్టు పట్టణ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మృతిచెందిన యువకులు గౌరీపట్నానికి చెందిన సిహెచ్ సురేష్ (18), సిహెచ్ వెంకటేష్ (22)లుగా గుర్తించినట్టు తెలిపారు. శనివారం రాత్రి నుంచి పోలీసులు, జాలర్లు ముమ్మరంగా గాలింపుచర్యలు చేబట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పట్టణ ఎస్సై పి రమేష్ కేసు నమోదుజేసి దర్యాప్తు చేస్తున్నారు.

కారు - వ్యాను ఢీ
* వ్యాపారవేత్త నంద్యాల కృష్ణమూర్తికి గాయాలు
నల్లజర్ల, ఏప్రిల్ 22: నల్లజర్లలో కారు-ఐసర్ వ్యాను ఢీకొన్న సంఘటనలో తాడేపల్లిగూడెంకు చెందిన ప్రముఖ ఉల్లిపాయల వ్యాపారి, కాపు నాయకుడు నంద్యాల కృష్ణమూర్తికి తీవ్ర గాయాలయ్యాయి. తాడేపల్లిగూడెం నుంచి ఫోర్డ్ కారులో ఆయన అన్న కుమారుడు రవితో కలిసి జంగారెడ్డిగూడెంలో జరగనున్న నిశ్చయ తాంబూలాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు, వ్యాను బోల్తా పడ్డాయి. కృష్ణమూర్తి, రవితో పాటు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. కృష్ణమూర్తికి తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై వి చంద్రశేఖర్ సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.