క్రైమ్/లీగల్

వచ్చేనెల 22న కోర్టుకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, ఆయన భార్య, మరో ముగ్గురిపై ప్రత్యేక న్యాయస్థానం మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. 7 కోట్ల రూపాయల మనీలాండరింగ్‌లో వారి ప్రమేయం ఉన్నట్టు ప్రాథమిక విచారణలో బయటపడింది. నిందితులందరూ మార్చి 22న కోర్టుకు హాజరుకావాలని ప్రత్యేక న్యాయమూర్తి సంతోష్ స్నేహి మాన్ ఆదేశించారు.
83 ఏళ్ల వీరభద్ర సింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇంతకుముందే చార్జిషీట్ దాఖలు చేసింది. అలాగే సింగ్ భార్య ప్రతిభాసింగ్ (62), యూనివర్సల్ ఆపిల్ అసోసియేట్ యజమాని చున్నీలాల్ చౌహాన్, మరో ఇద్దరు ప్రేమ్‌రాజ్, లావన్ కుమార్ రోచ్‌కు సమన్లు జారీ అయ్యాయి.
నిధులను అక్రమపద్ధతుల ద్వారా బీమా పాలసీలకు తరలించినట్టు అభియోగం. తుది నివేదికలో ఎల్‌ఐసీ ఏజెంట్ ఆనంద్ చౌహాన్ పేరునూ చేర్చారు. నిందితులందరిపైనా ప్రివెన్స్‌న్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. చౌహాన్‌ను 2016 జూలై 9న అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి 2న ఆయనకు బెయిల్ మంజూరైంది. వీరభద్రసింగ్, ఆయన భార్యను ఇప్పటివరకూ అరెస్టు చేయలేదు. మిగతా నిందితులందరూ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు.