క్రైమ్/లీగల్

పార్కింగ్ వద్ద లొల్లి,, థియేటర్ మేనేజర్ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఏప్రిల్ 23: పార్కింగ్ వద్ద గొడవ థియేటర్ మేనేజర్ హత్యకు దారితీసింది. వికారాబాద్ సీఐ మాగంటి వెంకట రామయ్య తెలిపిన వివరాల ప్రకారం- ఆదివారం రాత్రి సినిమ్యాక్స్‌లో సినిమా చూసేందుకు వాహనంతో వచ్చిన రాజవర్దన్ రెడ్డి పార్కింగ్ వద్ద డబ్బు చెల్లింపు విషయంలో నిర్వాహకుడితో గొడవపడ్డాడు. నిర్వాహకుడు థియేటర్ మేనేజర్ రాఘవేంద్ర రావు (56)ను పిలిచాడు.
రాజవర్దన్ రెడ్డి, రాఘవేంద్ర రావు మధ్య మాటామాటా పెరిగింది. రాజవర్దన్ రెడ్డి ఆగ్రహంతో రాఘవేంద్ర రావు చాతిపై పిడిగుద్దులు గుద్దాడు. నొప్పితో థియేటర్ బయటకు వచ్చిన రాఘవేంద్ర రావు ఫోన్ చేస్తూనే కింద పడిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.