క్రైమ్/లీగల్

పురుషోత్తంరెడ్డి బినామీలపై ఏసీబీ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఉప్పల్, ఫిబ్రవరి 12: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగంలో డైరెక్టర్‌గా డిప్యూటేషన్‌పై వచ్చిన టౌన్ కంట్రీ ప్లానింగ్ డైరక్టర్ పురుషోత్తంరెడ్డి బినామీలపై ఎసిబి అధికారులు దృష్టి సారించారు. బినామీలైన ఎ.యాదవరెడ్డికి చెందిన పీర్జాదిగూడలోని చెన్నారెడ్డి ఎన్‌క్లేవ్‌లోని శ్రీ సాయి హరిహర ఎస్టేట్‌లోని శ్రీ సాయి ఆనందమై రెసిడెన్సీలో అవినీతి నిరోధకశాఖ అధికారులు సోమవారం సోదా నిర్వహించారు. పురుషోత్తంరెడ్డి అక్రమార్జనకు యాదవరెడ్డితో పాటు నిశాంత్‌రెడ్డిలు అనే అభియోగంపై ఇప్పటికే అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆనందమై నిర్మాణ సంస్థలైన ఎస్టేట్‌లోని ఎజి నుంచి జి బ్లాక్ వరకు అపార్ట్‌మెంట్స్ బ్లాక్‌లకు సంబంధించిన పత్రాలను ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు గంగారాం, నాగాచారి పరిశీలించారు. ఇందులో ఎవరెవరు పార్టనర్స్ అన్న వివరాలను సేకరించారు. కోట్ల రూపాయల అక్రమ సంపాదన కల్గియున్న పురుషోత్తంరెడ్డి పరారీలో ఉండగా, మరో వైపు ఈ కేసు వివరాలను ఆదాయపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లకు అప్పగించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో టౌన్ ప్లానింగ్ అధికారిగా పని చేస్తూ డిప్యూటేషన్‌పై హెచ్‌ఎండీఏలో డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పురుషోత్తంరెడ్డి నగర శివారులో కొత్తగా వెలసిన లేఅవుట్‌లు, భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. హెచ్‌ఎండీఏలో పనిచేస్తున్న మరికొందరు ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి పెట్టారు.