క్రైమ్/లీగల్

ప్రేమను తిరస్కరించిందని యువకుడు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, ఫిబ్రవరి 13: మండల పరిధిలోని రామాపురం పంచాయతీ వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన ముకరంబాకం మదన్(22) ప్రియురాలు తన ప్రేమను తిరస్కరించిందని పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వెంకటాద్రిపాలెంకు చెందిన మదన్ తమిళనాడులోని గుమ్మడిపూండి ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలో ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడి తన కుటుంబ సభ్యులకు తన ప్రేమ విషయాన్ని తెలపగా, మేనెలలో పెళ్లి జరిపిస్తామని తల్లితండ్రులు తెలిపారు. కానీ మదన్ ఆ యువతి వద్దకు వెళ్లి మనం ఎక్కడకైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని చెప్పగా, ఆ యువతి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన మదన్ తన ఇంటి వద్ద పురుగుల మందు తాగటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇది గమనించి కుటుంబ సభ్యులు అతడిని చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. కానీ పరిస్థితి విషమించి మదన్ ఆసుపత్రిలో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తడ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.