క్రైమ్/లీగల్

గుట్కా సరఫరా చేస్తున్న ముగ్గురి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర కరీంనగర్, ఏప్రిల్ 26: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా గుట్కాను సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి, వారి నుంచి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన తణుకు అలియాస్ గడ్డం శ్రీనివాస్, నిజామాబాద్‌కు చెందిన సోహెల్ అహ్మద్, గణేష్‌నగర్‌కు చెందిన బాలగోని వేణులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ గుట్కా విక్రయించేవారు కాకుండా సరఫరా చేసే వారిపై ఎక్కువ దృష్టి సారించామని, ఇందులో భాగంగానే గుట్కా సరఫరా చేస్తున్న శ్రీనివాస్, సోహెల్ అహ్మద్, వేణులను అరెస్ట్ చేసి, వారి నుంచి మొత్తం రూ.2.38లక్షల విలువచేసే గుట్కా ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. మరో వ్యాపారి నిజామాబాద్‌కు చెందిన ముక్తర్ అహ్మద్ పరారిలో ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికైన గుట్కా విక్రయాలు, సరఫరా మానుకోవాలని, లేనిపక్షంలో పీడీ యాక్టు నమోదు చేయడమేకాకుండా వారి ఫోటోలను బస్టాండ్, ముఖ్య కూడళ్లల్లో పెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టాస్క్ఫోర్స్ సీఐలు శ్రీనివాసరావు, మాధవి తదితరులు పాల్గొన్నారు.