క్రైమ్/లీగల్

ఘరానా మోసగాడు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్ధన్నపేట, ఏప్రిల్ 26: వివాహాల పేరుతో ఆన్‌లైన్ వివాహ పరిచయ వేదికలను అడ్డాగా మార్చుకుని ఒం టరి మహిళలను, యువతులను మో సం చేస్తు డబ్బులు డ్రా చేసి కాజేస్తు న్న ఓ ఘరానా మోసగాడిని వర్ధన్నపే ట పోలీసులు అరెస్ట్ చేశారు. గురువా రం ఎసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడిని ప్రవేశపెట్టిన అనంతరం ఎసీపీ మధుసూదన్ మాట్లాడుతూ శ్రీకాకాళ ం జిల్లా కవిటి (మం) బసవ కొత్తూరు గ్రామానికి చెందిన నీలగిరి హరహరరావు అలియాస్ నీలగిరి భాస్కర్‌రావు తరుచూ పేర్లు మార్చుతూ ఆన్‌లైన్ ద్వారా వివాహ పరిచయ వేదికలలో ఒంటరి మహిళలను, యువతలను పె ళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేస్తూ డబ్బులు కాజేస్తూ, మరింత కట్నం కావాలని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడని తెలిపారు. వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన ఒంటరి మహిళని పెళ్లి చేసుకుంటానని గత సంవత్సరం డిసెంబర్ నెలలో పరిచయం చేసుకుని మాయ మాటలు చెప్పి ఆన్‌లైన్ ద్వారా డబ్బు లు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటూ ఉండేవాడని, ఆ మహిళతో కలిసి గత రెండు నెలలక్రితం సహజీవనం కూడ చేశాడని, మహిళ పెళ్లి చేసుకుందా మని ఒత్తిడి తీసుకరావడంతో నింది తుడు ఆ మహిళను నీది రెండో వివాహమని, తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని, అధికమొత్తంలో వరకట్నం ఇవ్వాలని బ్లాక్‌మెయిల్‌కు పాల పడగా సదరు మహిళ వర్ధన్నపేట పో లీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని అన్నారు. దీంతో వర్ధన్నపేట పోలీసులు రంగంలో దిగి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్ చేసి గురువారం కోర్టుకు తరలిస్తున్నట్లు ఎసీపీ తెలిపారు. సదరు బాధితురాలి నుండి ఇప్పటివరకు సుమారు ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు కాజేసి జల్సాలకు పాల్పడినట్లు వారు తెలిపారు.