క్రైమ్/లీగల్

బ్యాంకు ఆఫీసర్లమంటూ టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం(నూగురు) 26: స్టేట్ బ్యాంక్ ఆఫీసర్లమంటూ ఏటిఎం కార్డు బ్లాక్ అయింది రెన్యువల్ చేయాలి, ఏటిఎం కార్డు నెంబరు, పిన్ నెంబరు తెలియపర్చాలంటూ గురువారం ఉదయం మండల కేంద్రమైన వెంకటాపురంలో ఆర్‌అండ్‌బి ఉద్యోగి కుర్సా మల్లిఖార్జున్‌రావు సెల్‌కు ఫోన్ చేశారు. బ్యాంకు ఆఫీసర్ల అని నమ్మి బీర్వాలో ఉన్న ఏటిఎం కార్డు నెంబరు చెప్పారు. కార్డు రెండో వైపుఉన్న నెంబరు కూడా చెప్పాలని అగంతకుడు కోరటంతో అది కూడా చెపా పడు. ఆతర్వాత ఫోనుకు మెసేజ్ వస్తుందని, ఆ నెంబర్లు కూడా చెప్పాలని అగంతకుడు ఫోను కట్ చేశాడు. కొద్ది నిమిషాల తర్వాత ఫోనుకు వచ్చిన నెంబర్లు చె ప్పాడు. కొత్త కార్డు కోసం బ్యాంకు అధికారులను కలవాలని అగంతకుడు ఫో నును కట్ చేశాడు. మరికొద్ది నిమిషాలతర్వాత మొదటిసారి 9999రూపాయాలు ఖాతా నుంచి డ్రా అయినట్లు తెలవగా రెండోవ మెసేజ్ 39999రూపాయాలు, మూడవ మెసేజ్‌లో 9999రూపాయాలు మొత్తం 59వేల 987రూపాయాలు డ్రా అ యినట్లు సెల్ ఫోను మెసేజ్ అయినట్లు తెలుసుకొని అనుమానంతో వెంకటాపురం ఎస్‌బిఐ బ్యాంకు అధికారులకు జరిగిన విషయాన్ని విన్నవించాడు. ఫోను మెసేజ్ అధారంగా బ్యాంకు అధికారులు విచారణ చేపట్టారు. తామ మోసపోయినట్లు బాధితుడు వెంకటాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. అగంతకులు ఫోన్లు చేసి ఏటిఎం కార్డు నెంబర్లు, కోడ్ నెంబర్లు అడుగుతారని, సైబర్ నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాంక్ అధికారులు ఏ ఖాతాదారున్ని తమ ఎటి ఎం కార్డు నెంబర్, ఓటిపి నెంబర్ అడగరని ఖాతదారులు గుర్తుంచుకోవాలని సూచించారు. ఒకవేళ అలాంటి ఫోను వచ్చినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.