క్రైమ్/లీగల్

స్మశానవాటికలో యువకుడి దారుణహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, ఏప్రిల్ 29: పట్టణంలోని బేతవోలు స్మశానవాటికలో గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామానికి చెందిన ఇలపర్తి నాగచౌదరి(25) దారుణహత్యకు గురయ్యాడు. మృతుడు అవివాహితుడు, లారీ క్లీనర్‌గా పనిచేస్తూ ఆరు నెలల కిందట ట్రాక్టర్‌ను కొని వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా లింగవరానికి చెందిన నాగచౌదరి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేతవోలు స్మశానవాటికలో హత్యకు గురికావడం సంచలనం కల్గించింది. స్మశానవాటికలో శిథిలమైన రేకులషెడ్డులో ఉన్న చెక్క కమ్మితో తల వెనుక భాగంలో బలంగా కొట్టడంతో నాగచౌదరి అక్కడికక్కడే చనిపోయినట్టుగా తెలుస్తోంది. మృతదేహం పక్కనే నాగచౌదరి బంధువుకు చెందిన ఏపీ16 డీజే 7981 నెంబరు గల యాక్టివా స్కూటర్ ఉంది. ఈ స్కూటర్ హ్యాండిల్‌పై ఉన్న దుమ్మును బట్టి మృతుడు నాగచౌదరి నిందితుల నుండి తప్పించుకునే క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నించినట్టుగా స్పష్టమవుతోంది. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లు సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించాయి. వన్‌టౌన్ సీఐ వెంకటరమణ మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతుడు నాగచౌదరికి స్వగ్రామం లింగవరంలో ఉన్న వివాదాలు, సంబంధాలు తదితరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటనా స్థలంలో మద్యం తాగిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వన్‌టౌన్ సీఐ వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.