క్రైమ్/లీగల్

దంత వైద్యుడు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, ఏప్రిల్ 30: అప్పుల బాధ తాళలేక రావులపాలెంకు చెందిన ఒక దంత వైద్యుడు సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. గ్రామంలోని వైఎస్సార్ జంక్షన్ సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న కొవ్వూరి భీమ శ్రీనివాసరెడ్డి (38) కొనే్నళ్లుగా స్థానిక సీఆర్సీ రోడ్డులో జనప్రియ దంత వైద్యశాల నిర్వహిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా అప్పుల పాలైన శ్రీనివాసరెడ్డికి అవి తీర్చడం భారంగా మారింది. దీంతో మనస్తాపానికి గురైన అతను సోమవారం మధ్యాహ్నం తన ఇంట్లోని సీలింగ్ హుక్‌కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతునికి భార్య దేవికారాణి, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సిహెచ్ విద్యాసాగర్ తెలిపారు.