క్రైమ్/లీగల్

భార్య హత్యకేసులో భర్త, అత్తలకు జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఏప్రిల్ 30: ఆదోని డివిజన్‌లోని దేవనకొండలో భార్య విజయలక్ష్మీని హత్య చేసిన కేసులో భర్త నర్సప్ప, అత్త సుశీలమ్మలపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు శిక్ష విధిస్తూ ఆదోని రెండవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు తీర్పు చెప్పినట్లు అడిషనల్ పీపీ రఫత్ పేర్కొన్నారు. సోమవారం కేసు తీర్పును జడ్జి ప్రకటించినట్లు ఆమె పేర్కొన్నారు. 2012లో హతురాలు విజయలక్ష్మీ, ముద్దాయి నర్సప్పలకు వివాహం జరిగిందని నాటి నుంచే అదనపు కట్నం కోసం భర్త, అత్తలు శారీరకంగా, మానసికంగా బాదలు పెట్టేవారని చివరకు శరీరంపై కిరోసిన్ పోసి హత్యాయత్నం చేశారని అప్పట్లో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతురాలు విజయలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈకేసుపై డోన్ డీఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి విచారణ చేసి కోర్టుకు నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. దీనిపై నేరం రుజువు కావడంతో ముద్దాయిలకు జీవిత ఖైదు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ. 1000లు చొప్పున జరిమాన విధించారని జరిమాన కట్టని పక్షంలో రెండు నెలలు అదనంగా జైలు శిక్ష విదిస్తూ తీర్పు చెప్పినట్లు ఆమె వివరించారు. ఈమేరకు ముద్దాయిలను ఆదోని సబ్‌జైల్‌కు తరలించినట్లు కోర్టు కానిస్టేబుల్ లక్ష్మన్న, దేవనకొండ పోలీసులు పేర్కొన్నారు.