క్రైమ్/లీగల్

కరుగట్టిన దొంగల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 30: ఇళ్లకు కన్నంవేసే కరుగట్టిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ అనురాధ వెల్లడించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ అనురాధ మాట్లాడుతూ జిల్లాలో వివిధ మండాల్లో తాళం వేసిన ఇళ్లను గుర్తించి ఆ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డ చిట్యాల రవికుమార్ అలియాస్ లండన్ రవి, కమ్మరి వినోద్ అలియాస్ చారి అనే ఇద్దరు కరుగట్టిన దొంగలను అరెస్టు చేశామని తెలిపారు. వీరి నుండి దాదాపు 24 తులాల బంగారు అభరణాలు, 96 తులాల వెండి ఆభరణాలు స్వాదీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా వీరి నుండి రూ.35 వేల నగదు ఒక మోటారు బైక్‌ను స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుండి ఏప్రిల్ 15వ తేదీల మధ్య జడ్చర్ల, భూత్పూర్, పెబ్బెర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని నాలుగు దొంగతనాలు చేశారని తెలిపారు. జడ్చర్ల పోలీసుల పరిశోధనలో నిందితులను సోమవారం గుర్తించామన్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తాళాలు వేసిన ఇళ్లకు కన్నంపెట్టి దొంగతనాలకు పాల్పడెవారుగా జడ్చర్ల పోలీసులు నిర్ధారించారని విచారణలో నిందితులు ఒప్పుకున్నారని వెల్లడించారు. కాగా ఇదే కేసులో మణపురం సంస్థ నుండి 15 గ్రాముల బంగారం అదేవిధంగా ఓ టీవీ చానల్ రిపోర్టర్ నుండి 25 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలిపారు. టీవీ రిపోర్టర్‌పై కూడా చర్యలు ఉంటాయని ఎస్పీ వెల్లడించారు. రవికుమార్ దొంగతనాలే వృత్తిగా చేసుకుని జల్సాలు చేస్తూ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి జనవరిలో విడుదలయ్యారని వివిధ ప్రాంతాలలో తిరుగుతున్న నేపథ్యంలో కమ్మరి వినోద్ రవికి పరిచయం అయ్యాడని తెలిపారు. ఇరువురు కలిసి తాళాలు వేసి ఉన్న ఇళ్లను దొంగిలించారని తెలిపారు. నిందితులను రిమాండ్‌కు పంపుతున్నట్లు వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో డీఎస్పీ భాస్కర్, సీఐ బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.