క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, ఏప్రిల్ 30: భద్రాచలం ఐటీడీఏలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి గుత్తేదారుకు బిల్లు మంజూరు చేయడానికి ఐటీడీఏలోని ఇంజనీరింగ్ శాఖ ఈఈ శంకర్ రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. గుత్తేదారు అంత ఇచ్చుకోలేనని చెప్పినా ఈఈ అంగీకరించకపోవడంతో గుత్తేదారు శ్రీనివాసరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం ఏసీబీ అధికారులు ఈఈ అడిగిన డబ్బును ఇచ్చి వ్యూహం ప్రకారం గుత్తేదారును పంపారు. ఈఈ అందుబాటులో లేకపోవడంతో ఏఈకి డబ్బులు ఇస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు దాడి చేసి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ఈఈ శంకర్, ఏఈ సత్యనారాయణను హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఖమ్మం ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్ తెలిపారు. ఐటీడీఏ చరిత్రలో తొలిసారి ఏసీబీ దాడులతో కలకలం రేగింది.