క్రైమ్/లీగల్

జాతీయ రహదారిపై ఐసర్ వ్యాన్ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గండేపల్లి, మే 1: జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి మల్లేపల్లి గ్రామంలోని ఓ హోటల్ వద్ద ఐసర్ వ్యాన్ మంటల్లో దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..జగ్గంపేట వైపునుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న ఐసర్ వ్యాను మంగళవారం ఉదయం ముందు వెళుతున్న కారును ఢీకొట్టింది. ఈ సంఘటన జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. స్థానిక పోలీసులు ఢీకొట్టిన వ్యానును రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. అయితే రాత్రి ఒక్కసారిగా వ్యాను నుంచి మంటలు చెలరేగడంతో వ్యాను పూర్తిగా దగ్థమైంది. కాగా సమాచారం అందుకున్న జగ్గంపేట అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు సంఘటనా స్థలానికి చేరుకుంది. అప్పటికే వ్యాను పూర్తిగా దగ్థమైంది. వర్షం వచ్చిన తర్వాత వ్యాను దగ్ధం కావడం పట్ల స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై గండేపల్లి పోలీసులు కేసు నమోదుజేసి దర్యాప్తు చేస్తున్నారు.