క్రైమ్/లీగల్

కల్వర్టు కింద ల్యాండ్‌మైన్ సామగ్రి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుమ్ముగూడెం, మే 1: మావోయిస్టులు అమర్చిన ల్యాండ్‌మైన్‌కు సంబంధించిన సామాగ్రిని దుమ్ముగూడెం పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది మంగళవారం నిర్వీర్యం చేశారు. దుమ్ముగూడెం ఎస్సై బాలకృష్ణ విలేఖర్లకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మావోయిస్టులు దుమ్ముగూడెం మండలం చెరుపల్లి-మారాయిగూడెం గ్రామాల మధ్య రహదారిపై ఉన్న కల్వర్టు కింద పేలుడు పదార్థాలు ఉంచినట్లు సమాచారంతో జిల్లా ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా ఆదేశాల మేరకు పేలుడు స్వాధీనం చేసుకుని మావోల యత్నాన్ని భగ్నం చేశామన్నారు. చెరుపల్లి-మారాయిగూడెం రహదారిపై కల్వర్టు కింద ల్యాండ్‌మైన్ తయారు చేసేందుకు సమకూర్చే సామాగ్రి ఇనుప మేకులు, 6కేజీల బకెట్, 30 మీటర్ల వైర్లను స్వాధీనం చేసుకొని నిర్వీర్యం చేశామని ఎస్సై తెలిపారు. వీఐపీలను, టార్గెట్ వ్యక్తులను హతమార్చేందుకు మావోయిస్టులు కల్వర్టు కింద ఈ సామాగ్రిని అమర్చారని, వాటిని నిర్వీర్యం చేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందన్నారు. నిర్వీర్యం చేసిన సామాగ్రిని దుమ్ముగూడెం స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్ 141డీ బెటాలియన్ ఓసీ వెంకటేశ్వరరావు, స్పెషల్ పార్టీ సిబ్బంది, బాంబ్‌స్క్వాడ్ టీమ్ తదితరులు పాల్గొన్నారు.