క్రైమ్/లీగల్

పరిమితిని మించి ఆవులను రవాణా చేస్తున్నవారిపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశింకోట, మే 1: నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి పరిమితికి మించి ఆవులను వ్యాన్‌ల్లో తరలిస్తున్న 12 మంది రైతులపై కశింకోట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా అలమండ గ్రామం నుండి 70 ఆవులను తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లావాసులు 12 మంది పాడిరైతులు వ్యాన్‌లపై తరలిస్తుండగా గుర్తుతెలియని వారు వాట్సప్‌ద్వారా సోమవారం రాత్రి జిల్లా ఎస్.పి రాహుల్‌దేవ్‌శర్మకి ఫిర్యాదు చేసారు. దీంతో ఎస్.పి హుటాహుటీన కశింకోట ఎస్.ఐ మదుసూధనరావుకి ఈ సమాచారం చేరవేయడంతో అకస్మాత్తుగా జాతీయరహాదారిపై బందోబస్తు ఏర్పాటు చేసి తాళ్లపాలెం జంక్షన్ వద్ద ఆవులను తరలిస్తున్న వ్యాన్‌లను స్వాదీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఎస్.ఐ మదు రైతులతో చర్చించగా తమ వద్ద కొనుగోలు చేసిన రసీదులు ఉన్నాయని తాము వీటిని వేరే ఉద్దేశంతో కొనుగోలు చేయలేదని కేవలం తాము పాడి రైతులం మాత్రమేనని పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేసారు. పశువైద్యాధికారి కూడా ఈ ఆవులను పరిశీలించగా పాలు ఇచ్చేవి కొన్ని, సూడితో ఉన్నవి మరి కొన్ని ఉన్నాయని అన్నీ ఆరోగ్యకరంగానే ఉన్నాయని రిపోర్టు ఇచ్చారు. అయితే ఒక వ్యాన్‌లో ఆరు నుండి ఎనిమిది ఆవులను మాత్రమే తరలించాలని అయితే వీరు ఒకొక్క వ్యాన్‌లో 14 ఆవులను తరలించడంపై నిబంధనలకు విరుద్దంగా ఉండటంతో 12 మంది రైతులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆవులకు దాణా లేక అవస్థలు
తాము తరలిస్తున్న ఆవులకు దాణాలేక వీటిని తరలించే రైతులు నానా అవస్థలు పడ్డారు. అంతేకాకుండా సోమవారం రాత్రి నుండి మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు కూడా తమ సమస్య పరిష్కారం కాలేదని వారు ఆవేదన వెళ్లగక్కారు. తాము పాడిపశువులను తీసుకువెళ్లి జీవనోపాధి కల్పించుకోవడం కోసమేనని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదన్నారు. ఎస్‌పి ఆదేశాలు మేరకే వీటిపై దాడి చేసామని చెపుతున్నారని స్థానిక నాయకులు మాజీ ఉపసర్పంచ్ నడిపల్లి సన్యాశిరావును సంప్రదించారు. దీంతో ఎమ్మెల్యే పీలాగోవిందసత్యనారాయణకు, ఎంపి అవంతి శ్రీనివాసరావు సోదరుడు మహేష్‌కు పాడి రైతుల సమస్యలను వివరించారు. ఇదే సమయంలో ఈ గుంపులో ఉన్న ఒక ఆవు ప్రసవించింది. దీనిని చూసేందుకు స్థానికులు తరలివచ్చారు.