క్రైమ్/లీగల్

గుడిలో దొంగను పట్టించిన సీసీ కెమేరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుగంచిప్రోలు, మే 1: బతుకు తెరువుకోసం ఆలయం వద్ద ఆశ్రయం పొందుతూ అదే గుడికి కన్నం వేశాడు ఒక ప్రభుద్ధుడు. దేవాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సీసీ కెమెరాలు దొంగతనం చేస్తుండగా ఆ ప్రభుద్ధుడిని పట్టించిన ఘటన పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో స్వీపర్‌గా విధులు నిర్వహిస్తున్న తేజావత్ ధనమూర్తి అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా విధులకు హాజరు కాకపోవడంతో అధికారులు మానవతా దృక్పథంతో ఆ స్థానంలో అతని కుమారుడు తేజావత్ కొండనాయక్ అవకాశం కల్పించారు. గత పది రోజులుగా ఆలయం వద్ద విధులు నిర్వహిస్తున్న కొండ సోమవారం రాత్రి 7గంటల సమయంలో గోశాల వద్ద నుండి బేడా మండపం ఎక్కి రాజగోపురంలో దాక్కున్నాడు. రాత్రి 1గంట సమయంలో ఆలయంలో కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం వద్ద బేడా మండపంపై ఉన్న ఐరన్ గ్రిల్ తొలగించి ఆలయంలోకి ప్రవేశించి గోనె సంచి కప్పుకొని ఆలయంలో ఉన్న నాలుగు సీసీ కెమెరాలను నిలుపుదల చేశాడు. అనంతరం అన్నదానం హుండీలో నుండి ఐరన్ రాడ్ ద్వారా సుమారు 30వేలు దొంగిలించాడు. అయితే మరో సీసీ కెమెరా దీన్ని రికార్డు చేస్తుండటంతో ఆలయం వద్ద విధులు నిర్వహిస్తున్న నైట్ వాచ్‌మెన్ నలుమోలు శ్రీకాంత్, హోంగార్డు యడ్లపల్లి కొండ సీసీ టీవీ మానిటరింగ్ చేస్తున్న తరుణంలో చేతివాటాన్ని గమనించారు. వెంటనే ఎస్‌ఐ అవినాష్‌కు, పాలకమండలి చైర్మన్ కర్ల వెంకట నారాయణ, ఆలయ ఎఇఒ సిహెచ్ రామకృష్ణ ప్రసాద్‌కు విషయం తెలియజేయగా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆలయం తలుపులు తీసి లోపల ప్రవేశించగా కొండ దొరికిపోయాడు. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ఆలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. దీనిపై పాలకమండలి చైర్మన్ కర్ల వెంకట నారాయణ మాట్లాడుతూ గతంలో ఫిర్యాదులు ఉన్న వ్యక్తిని విధుల్లోకి ఎవరు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. గత నాలుగు రోజుల నుండి అతని విధుల నుండి తప్పించాలని అధికారులు సూచించినా ఉదాసీనంగా వ్యవహరించారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే దొంగను పట్టించిన నైట్ వాచ్‌మెన్ శ్రీకాంత్, హోంగార్డు యడ్లపల్లి కొండను పలువురు అభినందించారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని రిక్షాపుల్లర్ మృతి
విజయవాడ (క్రైం), మే 1: ఆర్టీసీ బస్సు ఢీకొని గాయపడిన రిక్షాపుల్లర్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన మద్దాల శివయ్య (50) నగరానికి వలస వచ్చి రిక్షా లాగుతూ జీవిస్తున్నాడు. కాగా సత్యనారాయణపురం పోలీస్టేషన్ పరిధిలోని కేదారేశ్వరరావుపేట రైతు బజారు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.