క్రైమ్/లీగల్

వైద్యుల నిర్లక్ష్యంతో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, మే 1: మంచిర్యాల పట్టణంలోని శ్రీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల సోమవారం రాత్రి హాజీపూర్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి అభిష్పా వర ప్రదాయిని ( 35) సోమవారం రాత్రి మృతి చెందిందని బంధువులు, తోటి సహాద్యోగులు ఆరోపించారు. వివరాలోకి వెళ్లితే హాజీపూర్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారిగా పని చేస్తున్న అభిష్పా వర ప్రదాయిని తన భర్త శ్రీనివాస్‌తో శ్రీ ఆసుపత్రిలో థైరాయిడ్ వ్యాధికి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకుంది. వైద్యులు రెండు రోజులలో ఆపరేషన్ చేస్తామని చెప్పడంతో సోమవారం ఆసుపత్రిలో చేరగా వైద్యుడు ఆశే్లష ఆపరేషన్‌కు సంబంధించిన అన్ని పరీక్షలు చేసి మధ్యాహ్నా 3 గంటల ప్రాంతంలో థియేటర్‌కు తీసుకెళ్లారని తెలిపారు. గంటన్నరలో ఆపరేషన్ పూర్తి చేస్తామని డాక్టర్‌లు 2 గంటలు దాటిన ఎలాంటి స్పందన లేకపోవడంతో సాయంత్రం 6 గంటలకు సిబ్బందిని అడుగగా ఎలాంటి సమస్య లేదని ఆపరేషన్ అయిపోయిందని సమాధానం చెప్పారని తెలిపారు. 7 గంటలకు రక్తం అవసరం ఉందని హాడావిడి చేయగా కుటుంబ సభ్యులు అధికారులు సిరియస్‌గా ఉందా అని అడిగినప్పటికీ సమాధానం చెప్పకపోవడంతో వైద్యుల హాడావిడిని చూసి కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు సిబ్బందిని నిలదీయగా మృతి చెందినట్లు చెప్పారని కుటుంబీకులు తెలిపారు. ఆపరేషన్ పాల్గొన్న సిబ్బంది అంతా పారిపోయ్యారని భర్త శ్రీనివాస్‌తో పాటు అధికారులు తెలుపగా వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మృతి చెందిందని ఆసుపత్రి నుండి కుటుంబ సభ్యులు తోటి అధికారులు ఆగ్రహానికి గురయ్యారు. దీనితో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన పోలీస్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మృతురాలికి అందించిన చికిత్సపై ఆరా తీశారు. ఆసుపత్రి వద్ద అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు విధులు నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.