క్రైమ్/లీగల్

ఏపీ పునర్విభజన హమీలను అమలు చేయాలని సుప్రీంలో మరో పిటీషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: ఆంధ్రప్రదేశ్ పునర్వభజన చట్టంపై ఇప్పటికే దాఖలు అయిన ఫిటీషన్‌లో మీరుకూడా సభ్యులు గా చేరండని ఆంధ్రా జెఎసి చైర్మన్ సుంకర కృష్ణమూర్తి,రవీందర్‌రెడ్డిలకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. పొంగులేటి సుధాకర్‌రెడ్డి వేసిన కేసులో మీరు ఇంప్లీడ్ కావాలని న్యాయస్థానం ఆదేశించింది. విభజన చట్టం హామీలను అమలు చేయడానికి కేంద్రానికి సూచనలు ఇవ్వాలని సోమవారం సుప్రీం కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆంధ్రా జాయింట్ యాక్సన్ కమిటి ఆధ్వర్యంలో సుంకర కృష్ణమూర్తి, రవీందర్‌రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను ప్రధానమంత్రి ప్రస్తావించారని వాటిని అమలు చేయాలని వారు కోర్టుకు విన్నవించారు. సోమవారం ద్విసభ్య ధర్మాసనం ముందు పిటీషన్ విచారణకు వచ్చింది, జస్టిస్ ఎకె సికిరి, జస్టిస్ అశోక్ బూషన్‌తో కూడిన బెంచ్ కేసుపై విచారణ చేపట్టింది. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రం పూర్తి చేస్తుందని అలాగే విశాఖపట్నం అలాగే రైల్వేజోన్ ఏర్పాటుకు హామీ ఇచ్చిందని కె శ్రావన్‌కుమార్ ఫిటీషన్ దాఖలు చేశారు.
విభజన చట్టంపై ఎంతమంది ఫిటీషన్లు దాఖలు చేస్తారని శ్రావన్‌కుమార్‌పై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అందుకు సుధాకర్‌రెడ్డి కేసుతో సంబంధం లేదని శ్రావన్‌కుమార్ కోర్టుకు విన్నవించారు.