క్రైమ్/లీగల్

శిరీష హత్య కేసులో మరొకరు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/శంకర్‌పల్లి మే 14 : సంచలనం సృష్టించిన డిగ్రీ విద్యార్ధిని శిరీష హత్య కేసులో నిందితుడు సాయప్రసాద్‌కు సహకరించిన అతని స్నేహితుడు షేఖ్ అబ్దుల్ మజీద్‌ను రెండో నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు స్థానిక శంకర్‌పల్లి సీఐ శశాంక్‌రెడ్డి తెలిపారు. సోమవారం సీఐ స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేఖరులకు ఆ వివరాలను వెల్లడించారు.
తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ మజీద్ ప్రైవేట్ వర్కర్‌గా పని చేస్తుంటాడు. తన చిన్ననాటి స్నేహితుడైన సాయప్రసాద్ శిరీషను ప్రేమిస్తున్న విషయం తెలుసునన్నాడు. ఈ నెల 9న ప్రసాద్ మజీద్‌కు ఫోన్ చేసి డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు ఇవ్వమని కోరాడు. ఎందుకు తన లైసెన్సు, ఆధార్ కార్డు కావాలని అడుగుతున్నావని మజీద్ తన స్నేహితుడిని ప్రశ్నించాడు. శిరీష తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నదని చివరిసారిగా మరొక్కసారి అడిగి, కాదంటే ఎక్కడికైనా కారులో తీసుకెళ్ళి చంపాలనుకుంటున్నానని ప్రసాద్ తన స్నేహితుడు మజీద్‌తో అన్నాడు. అయితే జూంకార్ యాప్‌లో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే కారు ఇస్తారు కాబట్టి ప్రసాద్ మజీద్‌ను డ్రైవింగ్ లైసెన్స్, ఆదార్ కార్డు అడిగాడు. దానికి మజీద్ ఒప్పుకోవడంతో ఈ నెల 5న కార్‌ను బుక్ చేశాడు. కార్ కోసం వారు శంషాబాద్‌కు వెళ్లి అక్కడ టీఎస్07యూఎఫ్ 5008 ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారును తీసుకొని, అలాగే దారిలో శిరీషను కూడా ఎక్కించుకొని చిలుకూరు వద్దగల గ్రీన్‌వాల్లీ రిసార్ట్స్‌కు వెళ్ళి రూం కావాలని అడిగారు. పెండ్లి కాని వారికి రూమ్ ఇవ్వమని యాజమాన్యం నిరాకరించడంతో అక్కడి నుండి వారు ప్రగతి రిసార్ట్స్ లోని కాటేజీకి వచ్చారు. పెండ్లికి ఒప్పుకోనందుకు కాటేజ్‌లోనే ప్రసాద్ శిరీషను కత్తితో దాడి చేసి చంపాడు. ఆ విషయాన్ని సాయిప్రసాద్ తన స్నేహితుడు మజీద్‌తో చెప్పగా తనను కూడా పోలీసులు పట్టకుంటారన్న భయంతో గూడూర్‌కు పారి పోయాడు. అక్కడ మజీద్‌ను బంధువుల ఇంటి వద్ద ఉండగా 13వ తేదీన అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.