క్రైమ్/లీగల్

నవ్‌జోత్‌సింగ్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: మాజీ క్రికెటర్, మంత్రి నవ్‌జోత్‌సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చే తీర్పును ఇచ్చింది. 1988నాటి కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన ధర్మాసనం సిద్ధూను నిర్దోషిగా విడుదల చేసింది. హత్యానేరం కిందికిరాని, శిక్షించదగ్గనేరంగా పరిగణించలేమని కోర్టు ప్రకటించింది. భారత శిక్షాస్మృతిలోని 304, 323 సెక్షన్ల కింద కేసు నుంచి విముక్తి కల్పింస్తున్నట్టు సుప్రీం స్పష్టం చేసింది. సిద్ధూతోపాటు ఆయన అనుచరుడు రూపీందర్ సింగ్ సంధూను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 1988 డిసెంబర్ 27న వాహనం పార్కింగ్‌కు సంబంధించి గొడవ జరిగింది. గుర్మాన్‌సింగ్(65) అనే వ్యక్తిపై సిద్ధూ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గుర్మాన్‌సింగ్ తరువాత ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. కేసు విచారించిన కింది కోర్టు సిద్ధూను దోషిగా నిర్ధారించి మూడేళ్ల జైలుశిక్షను విధించింది. అయితే బాధిత కుటుంబం శిక్షాకాలం పొడిగించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దశాబ్దాల తరువాత ఈ కేసులో సిద్ధూ, అతని అనుచరుడికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దుచేస్తూ నవ్‌జోతిసింగ్‌కు విముక్తి కల్పించింది. సిద్ధూకు 1000 రూపాయల జరిమానా విధిస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.