క్రైమ్/లీగల్

అమరావతిపై ఎన్జీటీలో మరో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని దాఖలైన పిటిషన్లను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) విచారణకు స్వీకరించింది. మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, బొలిశెట్టి సత్యనారాయణ ఎన్జీటీ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని పిటిషన్లు దాఖలు చేశారు.
మంగళవారం జస్టిస్ జావేద్ రహీమ్ నేతృత్వంలోని బెంచ్ కేసు విచారణకు స్వీకరించింది. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, సీఆర్‌డీఏ, కాలుష్య నియంత్రణ మండలికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. గతంలో విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై తప్పుడు నివేదికలు సమర్పించిందని, పర్యావరణ అనుమతుల మంజూరులో నిబంధనలను పాటించలేదని పిటిషనర్లు పేరొన్నారు.