క్రైమ్/లీగల్

శ్రీశాంత్ అభ్యర్థనపై జూలైలోగా నిర్ణయం తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2013 సీజన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌పై ఆరోపణలు ఎదుర్కొని జీవితకాలం నిషేధం ఎదుర్కొంటున్న భారత పేసర్ ఎస్. శ్రీశాంత్ అభ్యర్థనపై అతనిని విడుదల చేసే విషయమై జూలై నెలాఖరులోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును సుప్రీంకోర్టు మంగళవారం సూచించింది. 2013 ఐపీఎల్ సీజన్ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై శ్రీశాంత్‌తో పాటు మరో ఇద్దరు క్రికెటర్లు అజిత్ చండీలా, అంకీత్ చవాన్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు క్రికెటర్లపై బీసీసీఐ జీవితకాలం పాటు నిషే ధం విధించింది. ఒక క్రికెటర్ మళ్లీ బరిలోకి పునరాగమనం కోసం పడే ఆవేదన ఏమిటో తమకు తెలుసునని, కానీ ఈ విషయంలో హైకోర్టు నిర్ణయం వచ్చేవరకు వేచి ఉండాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. ఇంగ్లీష్ కౌంటీలో ఆడేందుకు తనకు తక్షణం అనుమతి మంజూరు చేయాలని శ్రీశాంత్ అభ్యర్థించాడు. సింగిల్ జడ్జి బెంచ్ కలిగిన కేరళ ట్రయల్ కోర్టు శ్రీశాంత్‌పై ఏడేళ్ల నిషేధాన్ని ఎత్తివేస్తూ గత ఏడాది ఆగస్టు 7న నిర్ణయం తీసుకుంది. దీనిపై ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఢిల్లీ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు వచ్చే వరకు వేచి ఉండాలని బాధితులకు సూచిస్తూ దీనిపై జూలై నెలాఖరులోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోరింది.