క్రైమ్/లీగల్

పోలీసులైనా జరిమానా తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: నిబంధనలు ఉల్లంఘించిన పోలీసులను సైతం నగర ట్రాఫిక్ పోలీసులు వదిలిపెట్టడం లేదు. ఇందుకు తాజాగా జరిగిన రెండు సంఘటనలే ఉదాహరణ. ఇటీవల పంజాగుట్ట స్టేషన్‌లో పని చేసే ఎస్‌ఐ ఒకరు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న సంగతి నగర సిపి అంజనీకుమార్ ఆదేశం మేరకు బదిలీ చేశారు. రెండు రోజుల కిందట జరిగిన సంఘటనలో ఏకంగా డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశంతో సైబరాబాద్‌లో పని చేసే ఒక అధికారి వాహనం రాంగ్ రూట్లో వెళ్లడంపై జరిమాన విధించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిజిపి తన వాహనంలో వెళుతుండగా, ఓ పోలీస్ వాహనం హిమయత్‌నగర్ ప్రాంతంలో రాంగరూట్లో వెళ్లడం గమనించి ట్రాఫిక్ పోలీసులకు ఆదేశించి ఆ వాహనం ఎవరిది, ఎందుకు రాంగ్ రూట్లో వెళ్లిందనే వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. దీంతో ట్రాఫిక్ విభాగం అధికారులు ఉరుకులు పరుగులు తీసి ఆ వాహ నం కనిపెట్టేందుకు ఆ ప్రాంతంలోని సిసి కెమెరాల రికార్డింగ్ మొత్తం పరిశీలించారు. మరో వైపు క్లూస్ టీం కూడా రంగంలో దిగి పరిశీలించింది. చివరకు సైబరాబాద్‌లో పని చేసే ఒక పోలీసు అధికారిది అని తేలడంతో వివరాలను అందించారు. అనంతరం ఆ వాహనంపై జరిమాన విధించారు. ఇప్పు డు విధించిన జరిమానతో కలిపి గతంలో విధించిన మొత్తం రూ. 2600 ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘించినా జరిమాన తప్పదనే సందేశాన్ని ఉన్నతాధికారులు చాలా సీరియస్‌గా చెబుతున్నట్లు ఉంది.