క్రైమ్/లీగల్

అతి వేగం మింగేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మే 18: అనంతగిరి కొండలకు బయలుదేరిన ఐదుగురు యువకుల్లో నలుగురు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సూరారం కాలనీ, సాయిబాబానగర్, పాండు బస్తీలో నివాసముండే రామారావు (19), ఉదయ్ (19), హేమసుందర్ (18), గణేశ్ (19), కిరణ్ (19) ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఐదుగురూ గురువారం కారు అద్దకు తీసుకుని శుక్రవారం తెల్లవారుఝామున 3 గంటల ప్రాంతంలో సూరారం నుంచి అనంతగిరి కొండలకు బయలుదేరారు. కారు జీడిమెట్ల సబ్‌స్టేషన్, డీపీ కాలనీ వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. కారు మూడు, నాలుగు పల్టీలు కొట్టింది. ఘటనలో రామారావు, ఉదయ్ అక్కడికక్కడే మృతిచెందారు. హేమసుందర్, కిరణ్, గణేశ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా హేమసుందర్ మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం చికిత్స పొందుతూ గణేశ్ మృతి చెందగా కిరణ్ పరిస్థితి విషమంగా ఉంది. మద్యం సేవించలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత వేగం ఐదు కుటుంబాల్లో శోకాన్ని మిగిల్చింది. ఎదిగిన కొడుకులు దూరమవడంతో కుటుంబాల్లో దుఃఖాన్ని మిగిల్చింది. వాహనాలను అతివేగంగా నడుపుతూ ప్రాణాలను కోల్పోవద్దని పదేపదే పోలీసులు చెబుతున్నా ఫలితం లేకుండాపోతుంది. అతివేగం కారణంతో ఒకేసారి నలుగురు యువకులు మృతి చెందడంతో సూరారం కాలనీలో దిగ్భ్రాంతి నెలకొంది.