క్రైమ్/లీగల్

బైకును ఢీకొన్న లారీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమీన్‌పూర్, మే 18: చిన్నప్పటి కలిసిమెలిసి మంచి స్నేహితులుగా ఉంటూ ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో జీవిస్తున్న ముగ్గురు యువకులను యమపాశం ఒకేచోటకు చేర్చి లారీ రూపంలో కబళించుకుపోయిన విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట పంచాయతీ మీదుగా వెళ్లే ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువకులు మరణంలోనూ స్నేహితులుగానే తిరిగిరాని లోకాలకు వెళ్లారంటూ స్థానికులు విచారం వ్యక్తం చేసారు. మృతుల బంధువులు, అమీన్‌పూర్ పోలీసుల కథనం ప్రకారం..రాజస్థాన్ రాష్ట్రం పాలిక్ జిల్లా రాయ్‌పూర్ తాలుకా అకెల్లి గ్రామానికి చెందిన సూరజ్‌సింగ్ (22), బల్‌బీర్ (22), సుభాన్‌ఖాన్ (24)లు చిన్నప్పటి నుండి మంచి స్నేహితులుగా జీవిస్తున్నారు. సూరజ్‌సింగ్ నగరంలోని బాచుపల్లిలో ఓ బట్టల దుకాణంలో పని చేస్తుండగా, సుభాన్‌ఖాన్ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. మరో స్నేహితుడు బల్‌బీర్ స్వగ్రామంలో ఖాళీగా ఉండటంతో ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. స్వగ్రామం నుండి తన మిత్రుడు వచ్చాడన్న సమాచారంతో చెన్నయ్‌లో ఉంటున్న సుభాన్‌ఖాన్ కూడా హైదరాబాద్‌కు వచ్చాడు. బల్‌బీర్‌కు ఉద్యోగం ఇప్పించడానికై గురువారం సాయంత్రం పటాన్‌చెరులో ఉండే సూరజ్‌సింగ్ బావ పప్పుసింగ్ వద్దకు వెళ్లారు. ఆ రాత్రికి పటాన్‌చెరులోనే పప్పుసింగ్ వద్ద ఉన్న ముగ్గురు యువకులు శుక్రవారం భోజనం చేసుకుని తిరిగి బాచుపల్లికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. కిష్టారెడ్డిపేట, వడక్‌పల్లి వెళ్లే దారికి చేరుకోగానే అతివేగంగా ఎదురుగా దూసుకువచ్చిన లారీ బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు చెల్లాచెదురుగా పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. కొద్ది సేపటి వరకు తనవద్దనే ఉన్న ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలుసుకున్న సూరజ్‌సింగ్ బావ పప్పుసింగ్ దిగ్భ్రాంతి చెంది హుటాహుటిన బంధువులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. సంఘటన స్థలాన్ని సందర్శించిన అమీన్‌పూర్ సీఐ రాంరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.