క్రైమ్/లీగల్

అవినీతి నిరోధక శాఖ వలలో మలక్‌పేట్ ఆర్టీఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: నగరంలోని ఈస్ట్‌జోన్ మలక్‌పేట రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (ఆర్టీఓ) ఎ.నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. నాగరాజుతో పాటు ఆ కార్యాలయంలో పనిచేసే హోంగార్డు టి.వెంకటరమణ, కె.శివశంకర్‌గౌడ్ అనే మరో ప్రైవేట్ వ్యక్తిని కూడా ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేశారు. అంబర్‌పేటకు చెందిన మహ్మద్ లతీఫ్ ఖురేషి అనే వ్యక్తికి చెందిన ట్రావెల్ కారు ప్రమాదానికి గురై కాలిపోయింది. ఆ కారుకు ఉన్న రిజిష్ట్రేషన్‌ను రద్దు చేసేందుకు రూ.రూ.6వేలు లంచం డి మాండ్ చేశారు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా పక్కా ప్రణాళికతో అధికారి లంచం తీసుకుంటుండగా పట్టకు న్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ డీజీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.