క్రైమ్/లీగల్

గుత్తి ఆర్‌ఎస్‌లో చోరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, మే 20: గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని గుత్తిఆర్‌ఎస్ పత్తికొండ రోడ్డులో గల లోకేష్ అనే వ్యక్తి ఇంట్లో శనివారం రాత్రి చోరి జరిగింది. సంఘటనలో 20 తులాల బంగారు నగలు, 2లక్షలకు పైగా నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గుత్తి పట్టణంలో హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న లోకేష్ శనివారం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతోకలసి బంధువుల ఇంట్లో శుభకార్యంలో పాల్గొనడానికి వెళ్లాడు. దుండగులు శనివారం అర్ధరాత్రి ఇంటి ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో భద్రపరచిన 20 తులాల బంగారు నగలతోపాటు, రూ. 2లక్షలు అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న గుత్తి సీఐ ప్రభాకర్‌గౌడ్ సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుత్తి ఆర్‌ఎస్‌లోని పత్తికొండ రోడ్డులో జరిగిన చోరీలో ముద్దాయిలను గుర్తించేందుకు ఆదివారం క్లూస్ టీం రంగంలోకి దిగింది. కర్నూల్ నుండి విచ్చేసిన క్లూస్ టీం అధికారులు సీఐ ప్రభాకర్‌గౌడ్‌తో కలసి ఇంటిని పరిశీలించారు. దుండకులు ఇంటితాళాలు పగులగొట్టే సమయంలోను, బీరువాను పగుల గొట్టి నగదు అపహరించుకుపోయిన సమయంలోను ఆయా ప్రాంతాల్లోని వేలిముద్రలను క్లూస్ టీం అధికారులు సేకరించారు. నిందితులను వీలైనంత త్వరలో పట్టుకుంటామని గుత్తి సీఐ పేర్కొన్నారు.