క్రైమ్/లీగల్

ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు వల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తంగళ్ళపల్లి, మే 20: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వల వేసి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు దండుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుద్యోగుల ఆశలను ఆసరాగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్న ముఠాలు రోజు రోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. బలహీనతలను ఆసరాగా తీసుకుని ఆన్‌లైన్ మోసాలతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వీటిపై నియంత్రణ లేకపోవడంతో అమాయకుల బలహీనతను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. ఇదే తరహలో తెలంగాణ ఆగ్రో ఫుడ్ కార్పొరేషన్ పేరిట ఢిల్లీ కేంద్రంగా ఒక నకిలీ సంస్థను సృష్టించి పదవ తరగతి, ఇంటర్‌తో 4727 ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం వేలల్లో జీతం అనడంతో ఆకర్షితులైన నిరుద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థ నోటిషికేషన్ అని భావించి వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకుని ఫీజు తక్కువ మొత్తం కావడంతో రూ.98 ఆన్‌లైన్ ద్వారా చెల్లించారు. ఐటెక్ సొల్యూషన్స్ కంపెనీ, భగీరథ్ ప్యాలెస్ ఢిల్లీ పేరుతో కాల్ లెటర్ రావడంతో సంతోషపడి పోస్టల్ చార్జీల రూపంలో రూ.499 చెలించి కాల్ లెటర్ తెరచి చూడగా, తాము దరాఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి ఏమాత్రం సంబందం లేకుండా ఇంటి వద్దనే ఉండి నెలకు రూ.15 వేలు సంపాదించే మార్గం చెబుతాం అందుకోసం మరో రూ.700 చెల్లించాలని ఉండడంతో నిరుద్యోగులు లబో దిబో అంటున్నారు. కాల్ లెటర్‌ను నమ్మి రూ.700లు చెల్లించి మోసపోయిన బాధితులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తాము ఆన్‌లైన్ మోసానికి గురైనట్టు నలుగురికి చెప్పుకుంటే పరువు పోతుందనే ఆలోచనతో తమలో తామే మనోవేదనకు గురవుతున్నారు. తెలంగాణ ఆగ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరిట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు లక్షల సంఖ్యలో కోట్ల రూపాయల మోసానికి గురయ్యారు. ఈ విషయమై తెలంగాణ ఆగ్రో కార్పొరేషన్ శాఖ నుండి వివరణ కోరగా తెలంగాణ ఆగ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో విడుదల అయిన నోటిఫికేషన్‌తో తమ సంస్థకు ఎటువంటి సంబందం లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన అనంతరం తమ సంస్థకు ఇప్పటివరకు వెబ్‌సైట్ రూపొందించ లేదని ఎటువంటి నోటిషికేషన్ కూడా జారీ చేయాలేదని తప్పుడు నోటిఫికేషన్ల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని మోసపోవద్దని తెలిపారు.

రూ. 60 వేల విలువచేసే గుట్కా పట్టివేత
ముకరంపుర కరీంనగర్, మే 20: నగరంలోని మంకమ్మతోట ప్రాంతానికి చెందిన లింగమూర్తి వద్ద 60 వేల రూపాయల గుట్కాను ఆదివారం పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. లింగమూర్తి నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రామడుగు, గంగాధర ప్రాంతాల్లోని కిరాణం, పాన్‌షాపు దుకాణాలకు గుట్కా విక్రయిస్తున్నాడన్న సమాచారంతో లింగమూర్తిని రాంనగర్‌లోని అతని ఇంటి వద్ద విచారించగా ఇతనికి కోనరావుపేట మండల ప్రాంతానికి చెందిన ఎలగందుల సంతోష్ అనే వ్యక్తి గుట్కాను సప్లై చేస్తున్నాడని సమాచారం ఇవ్వగా అదే సమయంలో సంతోష్ తన కారులో గుట్కా సరుకును అప్పగించడానికి రావడంతో వీరిరువురి స్థావరాల్లో టాస్క్ఫోర్స్ వారు సోదాలు చేయగా వీరి వద్ద నుండి 60 వేల రూపాయల విలువగల గుట్కా ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిరువురికి బీదర్ ప్రాంతానికి చెందిన గురుదాస్ అనే వ్యక్తి గుట్కాలను తెచ్చి విక్రయిస్తున్నాడని తెలిసింది. పై ఇద్దరి నిందితులపై గతంలో కూడా ఇదే వ్యాపారం నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకొని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. వీరి నేర ప్రవృత్తిని సునిశితంగా అదుపు చేయడానికి వీరిపైన అనుమానిత షీట్లు తెరిచి తగు నిఘా ఉంచబడునని వారు తెలిపారు. వీరి వద్ద నుండి టాటా విస్తా కారు, రూ.30 వేల విలువగల త్రిబులెక్స్ గుట్కా ప్యాకెట్లు, రూ.30 వేల విలువ గల అంబర్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్‌పోర్స్ సిఐలు శ్రీనివాస్ రావు, మాధవి, కరీంనగర్ టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ మహేష్ గౌడ్, ఎస్‌ఐ రమేష్, ఎఎస్‌ఐ నర్సయ్య, టాస్క్ఫోర్స్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక మీదట గుట్కా విక్రయాలకు పాల్పడితే మూడు అంతకంటే ఎక్కువ కేసులు నమోదైతే పిడి యాక్టు నమోదు చేస్తామని, అదేవిధంగా గుట్కా అమ్మే వారి ఫోటోలను బస్టాండ్, థియేటర్స్, ట్రాఫిక్ చౌరస్తాలలో పెడతామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి హెచ్చరించారు.