క్రైమ్/లీగల్

చెక్ బౌన్స్ కేసులో రెండేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, మే 21:చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో చెన్నైకి చెందిన ఎల్.శ్రీనివాసన్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ ఎంవీఎన్.పద్మజ సోమవారం తీర్పు చెప్పారు. మైనింగ్ వ్యాపార లావాదేవీల్లో భాగంగా కర్నూలు నగరానికి చెందిన ఎస్‌ఎ మినరల్ అధినేత ఎస్‌ఎండీ సోహైల్‌కు చెన్నైకు చెందిన వీఎల్‌ఎస్ లాజిస్టిక్ సంస్థ అధినేత ఎల్.శ్రీనివాసన్ రూ. 2కోట్లకు చెక్కు ఇచ్చాడు. దీంతో సోహైల్ ఆ చెక్కును నగదుగా మార్చుకునేందుకు బ్యాంకులో ఇవ్వగా బౌన్స్ అయింది. అనంతరం ఫిర్యాది తరఫున న్యాయది ద్వారా నోటీసు పంపగా ముద్దాయి డబ్బు చెల్లించలేదు. దీంతో ఫిర్యాదుదారుడు కోర్టును ఆశ్రయించగా కోర్టులో నేరం నిరూపణ అయింది. 2017 నవంబర్ 14న తీర్పు ఉండగా నిందితుడు హాజరు కాలేనందు వల్ల అతడికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా అతడిని పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరు పరచగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారు. నిందితుడు ఎల్.శ్రీనివాసన్‌కు రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
పిడుగుపాటుకు బాలిక మృతి
బనగానపల్లె, మే 21:పట్టణంలోని బీసీ రాజారెడ్డి కాలనీలో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఏర్పడిన పిడుగుపాటుకు నాజియా(15) మృతిచెందింది. బాలిక తల్లిదండ్రులు, స్థానికులు తెలిపిన వివరాలు.. నాజియా దుస్తులు ఉతికి ఇంటి పైకప్పుపై ఆరవేసేందుకు వెళ్లిన సమయంలో పిడుగుపాటు సంభవించిందని ఈ సంఘటనలో బాలిక దుస్తులు కూడా కాలిపోయినట్లు తెలిపారు. బాలిక అరుపులతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు బాలికను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. నాజియా 9వ తరగతి చదివిందని తల్లిదండ్రులు తెలిపారు.
అత్తింటి వేధింపులు తాళలేక
వివాహిత ఆత్మహత్య
బేతంచెర్ల, మే 21:పట్టణంలోని సంజీవనగర్ కాలనీలో నివాసం ఉంటున్న షేక్ సన(23) అత్తింటి వారి వేధింపులు తాళలేక ఆదివారం అర్ధరాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ కంభగిరి రాముడు తెలిపిన వివరాలు.. సంజీవనగర్‌కు చెందిన షేక్ మహమ్మద్‌గౌస్, మాదర్‌బీ దంపతుల కుమారుడు షేక్ ఇస్మాయిల్‌తో అదే కాలనీకి చెందిన షేక్ అబాస్‌బీ కుమార్తె సనకు వివాహం జరిపించారు. అయితే వివాహమై ఐదేళ్లు అవుతున్నా సంతానం కలగలేదని అత్త మదార్‌బీ, భర్త ఇస్మాయిల్ చాలాకాలంగా సనను వేధింపులకు గురిచేయడంతో భరించలేక ఉరి వేసుకుందని సన తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు సీఐ తెలిపారు. కాగా సన బంధువులు ఇస్మాయిల్‌పై దాడి చేశారని, దీంతో అతడు కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన వెంటనే తహశీల్దార్ తిరుమలవాణి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.