క్రైమ్/లీగల్

లారీ ప్రమాదంలో క్లీనర్ దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మే 25: మండల పరిధిలోని కురగల్లు - నీరుకొండ గ్రామాల మధ్య నిర్మాణం పనులకు సంబంధించిన సెంట్రింగ్ సామగ్రిని లారీలో తరలిస్తుండగా లారీ క్యాబిన్ విరిగి పడటంతో అందులో ఉన్న క్లీనర్ సయ్యద్ హుస్సేన్ (20) దుర్మరణం పాలయ్యాడు. గురువారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన వివరాలను రూరల్ పోలీసులు వెల్లడించారు. లారీలో సామర్థ్యానికి మించి సామగ్రి ఉంచి రవాణా చేస్తుండగా కదులుతున్న లారీ క్యాబిన్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో బీహార్‌కు చెందిన క్లీనర్ సయ్యద్ హుస్సేన్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై వినోద్ శుక్రవారం తెలిపారు.