క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, మే 25: మండలంలోని చనుగొండ్ల గ్రామంలో శుక్రవారం జరిగిన విద్యుదాఘాతానికి రైతు నడిపి మాదన్న (50) మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నడిపి మాదన్న తనకు ఉన్న పొలంలో మిరప పంటను సాగు చేశాడు. ఉదయం మెరప పంటకు నీటి పెట్టడానికి వెళ్లాడు. ఇదే పొలం పక్కన మరో రైతు మోహన్ పొలంలో విద్యుత్ తీగలు తెగి కింద పడ్డాయి. కింద పడ్డ తీగలను నడిపి మాదన్న చూసుకోక కాలు పెట్టగా కరెంటు షాక్‌కు గురయ్యాడు. దీంతో మాదన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం స్వాధీనం.. ఇద్దరి అరెస్టు
ఆదోనిటౌన్, మే 25: మండల పరిధిలోని చిన్నహరివాణం గ్రామంలో ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించి 17 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సైదులు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐ శ్రీ్ధర్ దాడులు నిర్వహించి హనుమయ్య నుండి 9 మద్యం సీసాలు, సుభద్రమ్మ నుంచి 8 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుక్నుట్లు తెలిపారు. వీరు బెల్టుషాపులు నిర్వహిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
ఉయ్యాలవాడ, మే 25: మండలంలోని మాయలూరు వద్ద కడప జిల్లా జమ్మలమడుగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. అదుపులోకి తీసుకున్న ట్రాక్టర్లను కోవెలకుంట్ల కోర్టులో హాజరు పరచనున్నట్లు స్పష్టం చేశారు.
కానిస్టేబుళ్ల బదిలీ...
స్థానిక పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు. హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు బ్రాహ్మణకొట్కూరు, గంగన్న బేతంచెర్ల, రఫి వెలుగోడు పోలీస్ స్టేషన్లకు బదిలీ అయినట్లు ఎస్‌ఐ స్పష్టం చేశారు.
దాడికేసులో ఇద్దరి అరెస్టు
కృష్ణగిరి, మే 25: మండల పరిధిలోని కొయిలకొండ గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌పై దాడిచేసిన కేసులో బోయపెద్దయ్య, బోయశివలను శుక్రవారం గ్రామ శివారలలో అరెస్టుచేసినట్లు ఎస్‌ఐ విజయభాస్కర్ తెలిపారు. చంద్రశేఖర్ గతంలో అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా కొంతమంది ప్రజల వద్ద డిపాజిట్లు సేకరించారు. అగ్రిగోల్డ్ కేసు ప్రస్తుతం హైకోర్టులో ఉన్నందున లబ్ధిదారులకు డబ్బు సకాలంలో ఇవ్వలేదు. తమ అగ్రిగోల్డ్ డబ్బు చెల్లించాలని ఇద్దరు ముద్దాయిలు చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి అతిని చొక్కపట్టి బయటికి లాగి అతనిపై దాడిచేశారని, అడ్డువచ్చిన ఆయన తల్లిపై కూడా దాడిచేశారు. చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు వీరి ఇద్దరిపై కేసునమోదుచేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు.