క్రైమ్/లీగల్

ప్రాణం తీసిన అన్నదమ్ముల భూ పంచాయతీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోయినిపల్లి, మే 25: అన్నదమ్ముల మధ్య భూ వివాదం కాస్త ప్రాణం తీసింది. శుక్రవారం అన్న ఫిర్యాదుమేరకు పోలీసులు తమ్మున్ని పిలిపించగా భయంతో పోలీస్ స్టేషన్‌లోనే కుప్పకూలిపోయాడు. ఇక వివరాల్లోకి వెళితే..బోయినిపల్లి మండల కేంద్రానికి చెందిన శ్రీపతి ఆదినారాయణ (70), అతని సోదరునికి మధ్య భూ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో అతని సోదరుడు ఆదినారాయణ మీద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆదినారాయణను శుక్రవారం పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వచ్చిన ఆదినారాయణతో అతని సోదరుడు వాగ్వివాదానికి దిగాడు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే వాగ్వివాదం జరగడంతో ఆందోళనతో భయాందోళనకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని పక్కనే ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు. ఆదినారాయణ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బోయినిపల్లి ఎస్‌ఐ వెంకటకృష్ణను వివరణ కోరగా పోలీస్ సిబ్బంది ఎవరు ఆదినారాయణను బెదిరించలేదని, అతను రాకకు సంబంధించిన ప్రతీ విషయం సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని, పోలీసుల ప్రమేయం లేదని తెలిపారు.

వడదెబ్బతో ఒకరి మృతి
సైదాపూర్, మే 25: మండలంలోని వెన్నంపల్లి పంచాయతీ సఫాయిగా పనిచేస్తున్న లస్మన్నపల్లి గ్రామనివాసి మాతంగి నర్సయ్య (70) శుక్రవారం ఉదయం వడదెబ్బ తగిలి మృతి చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన ప్రకారం ఎండవేడిమికి గత రెండు రోజులుగా అస్వస్థతకు గురై మృతి చెందినట్లు వారు తెలిపారు. వెన్నంపల్లి గ్రామ పంచాయతీలో గత తొమ్మిదేళ్లుగా పని చేస్తున్నాడని, ఆయన మృతికి స్థానిక సర్పంచ్ బిల్ల రాజిరెడ్డి, ఎంపీటీసీ బైరి రాజు, వార్డు మెంబర్లు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వపరంగా ఆదుకోవాలన్నారు.
హుస్నాబాద్‌లో కార్మికుడి మృతి
హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలో ఓ సామిల్లులో రోజువారీ కూలీగా పనిచేస్తున్న గడ్డం చంద్రయ్య 55 వడదెబ్బతో శుక్రవారం మృతి చెందాడు. చంద్రయ్య గత రెండు రోజు క్రితం వడదెబ్బతో అస్వస్థతకు గురై శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గడ్డం చంద్రయ్య మరణం కార్మిక వర్గానికి తీరని లోటని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం వడదెబ్బతో చనిపోయిన సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డం చంద్రయ్య మృతి పట్ల సీపీఐ పార్టీ ఘన నివాళులర్పించింది.