అంతర్జాతీయం

ఈ-మెయిల్‌ను మరణ వాంగ్మూలంగా స్వీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 28: వివాదాస్పదంగా మారిన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద మృతి కేసులో ఆమె పెట్టిన మెస్సేజ్‌లు, ఈ-మెయిళ్లను మరణ వాంగ్మూలంగా పరిగణించాలని పోలీసులు కోర్టును కోరారు. అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్న శశిథరూర్ భార్య సునంద 2014 జనవరి ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ‘నాకు బతకాలని లేదు. చావు రావాలని ప్రార్థిస్తున్నాను’ అని భర్త శశిథరూర్‌కు తాను చనిపోవడానికి తొమ్మిదిరోజుల ముందు ఈమెయిల్ చేసింది. సునంద మరణం విషం తీసుకోవడం వల్ల సంభవించిందని, ఆమె గదిలో 27 ఆల్‌ప్రాక్స్ టాబ్లెట్లను కనుగొన్నామని, అయితే ఆమె ఎన్ని టాబ్లెట్లు తీసుకుందో చెప్పలేమని పోలీసులు తెలిపారు. చనిపోవడానికి కొద్దిరోజుల ముందు ఆమె చేసిన ఈమెయిళ్లను ఆమె మరణవాంగ్మూలంగా భావించాలని కోర్టులో ప్రాసిక్యూషన్ వాదించింది. కాగా సునంద మరణంపై 2015 జనవరిలో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అప్పటి నుంచి విచారణ సాగుతోంది. కాగా, ఈనెల 14న కోర్టును ఆశ్రయించిన ఢిల్లీపోలీసులు ఈ కేసులో తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న శశిథరూర్‌ను నిందితుడిగా చేర్చి అతడి అరెస్ట్‌కు సమన్లు జారీ చేయాలని కోరారు. ఈ మేరకు మూడు వేల పేజీలతో చార్జిషీటును దాఖలు చేశారు. తన క్రూర చర్యల ద్వారా భార్య మరణానికి థరూర్ కారకుడని ఆరోపించారు. అతనిపై 498ఎ, 306 సెక్షన్లు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ముఖ్యమైన వైద్య నివేదికలను సైతం సమర్పించారు. నిందితుడు భౌతికంగా, మానసికంగా తన భార్యను వేధించాడని పేర్కొన్నారు. దీనిని విచారించిన ఢిల్లీ కోర్టు నిందితుడికి సమన్లు జారీ చేసే విషయమై తీర్పును జూన్ ఐదుకి వాయిదా వేసింది.