క్రైమ్/లీగల్

ఏఎస్‌ఐకి ఏడాది జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ (లీగల్), ఫిబ్రవరి 15: పోలీస్ శాఖలో ఎఎస్‌ఐగా ఉద్యోగం చేస్తూ రెండు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసీబీ అధికారులకు పట్టుబడ్డ ఎఎస్‌ఐ బుజ్జనగారి వేణుగోపాల్ (56)కు కరీంనగర్ ఎసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్‌రావు గురువారం సంవత్సరం జైలుశిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలంలోని జనగాం గ్రామానికి చెందిన తిమ్మయ్యగారి మదుసూధన్ రెడ్డి 2009, ఏప్రిల్ 21న తన గ్రామంలో నడుచుకుంటూ వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీనివాస్ తన ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. దీంతో మదుసూధన్ రెడ్డికి తీవ్ర గాయాలు కాగా బీబీపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. మదుసూధన్ రెడ్డి ఆంధ్రాబ్యాంక్‌కు చెందిన అభయ జీవన్ ఇన్సూరెన్స్ కోసం ఎఫ్‌ఐఆర్, మెడికల్ సర్ట్ఫికేట్, ఇతరత్రా కాగితాలు అవసరమున్నాయని ఎఎస్‌ఐని కోరాడు. దీనికి గాను ఎఎస్‌ఐ మూడువేల రూపాయలు లంచం ఇస్తేనే ఆయా కాగితాలను అందజేస్తానని తెలిపాడు. అన్ని రూపాయలు ఇవ్వలేనని, రెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తానని తెలిపాడు. 2009, మే 18న ఎసీబీ అధికారులను మదుసూధన్ రెడ్డి సంప్రదించాడు. దీంతో ఎసీబీ అధికారులు వలపన్ని ఎఎస్‌ఐ వేణుగోపాల్‌ను పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టుకు పంపారు. అనంతరం కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి సాక్షులను ప్రవేశపెట్టారు. తగిన సాక్షాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి భాస్కర రావు నిందితుడైన ఎఎస్‌ఐ వేణుగోపాల్‌పై నేరం రుజువు కావడంతో సంవత్సరం జైలుశిక్షతో పాటు పదివేల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. కాగా, ఈ కేసులో నిందితుడైన ఎఎస్‌ఐ వేణుగోపాల్‌కు కోర్టులో అనుకూలంగా సాక్ష్యం ఇచ్చిన ఫిర్యాదుదారుడు మదుసూధన్ రెడ్డి, హోం గార్డు భూపతిలపై ఎందుకు చర్య తీసుకోరాదో కోర్టుకు వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు.