క్రైమ్/లీగల్

గుర్తు తెలియని యువకుడు కాల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, జూన్ 1: శ్రీకాళహస్తి మండలం రామాపురం గ్రామం వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు గుర్తించారు. సుమారు 25 సంవత్సరాల వయస్సును యువకుడిని కాల్చి చంపినట్లుగా పోలీసులు నిర్దారణకు వచ్చారు. మృతుడు ఏ ప్రాంతం వ్యక్తి, ఎందుకు కాల్చి చంపారనే విషయాన్ని విచారిస్తున్నారు. సంఘటన జరిగి రెండు రోజులై ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. రామాపురం గ్రామం వద్ద ఉన్న రిజర్వాయర్‌కు సమీపంలో 2007లో బెంగళూరుకు చెందిన ఒక యువతిని కాల్చి చంపిన ప్రదేశానికి సమీపంలోనే ఈ సంఘటన కూడా చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి రూరల్, కేవీబీపురం మండలాల సరిహద్దులో ఈ సంఘటన జరిగింది. సంఘటన జరిగిన ప్రాంతం కేవీబీపురం మండలానికి సంబంధించిందని మొదట భావించారు. స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత శ్రీకాళహస్తి మండల పరిధిలోకి వస్తుందని నిర్ధారించుకున్నారు. రూరల్ సీఐ సుదర్శన ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని కాల్చిన వారు ఎటువంటి ఆనవాళ్లు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారని, పూర్తిస్థాయి విచారణ జరిపుతామని పోలీసులు తెలిపారు.