క్రైమ్/లీగల్

వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రోసూరు, జూన్ 1: స్థానిక కన్యకా పరమేశ్వరి దేవస్థానం వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ప్రమాదవశాత్తు లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన ఇది. క్రోసూరు గ్రామం కొండకింది బజారుకు చెందిన నక్కా రామారావు (40) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కన్యకా పరమేశ్వరి దేవస్థానం వద్ద రోడ్డు దాటుతుంగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ యజమాని మృతితో భార్యాపిల్లలు రోదిస్తున్న తీరు పలువురి చేత కంటతడి పెట్టించింది. అదే గ్రామంలో పశువైద్యశాల వద్ద అతివేగంతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న డిసిఎం వాహనాన్ని ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడి నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పీసపాడుకు చెందిన గొర్రెపాటి లక్ష్మమ్మ, ఇనిమెట్ల గ్రామానికి చెందిన ప్రభాకరరావు, యోహాను, నరసరావుపేటకు చెందిన గద్దె పుల్లయ్య గాయపడ్డారు. వీరిలో గద్దె పుల్లయ్య పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. ఎస్‌ఐ ఏడుకొండలు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పూరిల్లు దగ్ధం...
మండలంలోని అనంతవరం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కొవ్వొత్తిని వెలిగించి పడుకున్న పిల్లకతుకుల వెంకట్రావ్ పూరింటికి మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ఇంటి నిర్మాణం కోసం ఇంట్లో దాచుకున్న 4 లక్షల రూపాయల నగదు, మోటారు బైకు, ధాన్యం, వంట సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలానికి తహశీల్దార్ దుర్గేశ్వరరావు చేరుకుని బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.