క్రైమ్/లీగల్

మినీ లారీలు ఢీ.. డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిష్ణగిరి, జూన్ 3:వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదార్‌పురం గ్రామ సమీపంలో జాతీయ రహదారి-44పై ఆదివారం రెండు మినీ లారీలు ఢీకొన్న సంఘటనలో డ్రైవర్ శశికుమార్(26) మృతిచెందాడు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఐచర్ వాహనం మరమ్మతులకు గురవడంతో రోడ్డుపైనే ఆగిపోయింది. కొరియర్ లోడు తీసుకుని కర్నాటక వైపు వెళ్తున్న మినీ లారీ రోడ్డుపై నిలిచిపోయిన లారీని గమనించకుండా వెనుక నుంచి ఢీకొంది. ఈ సంఘటనలో డ్రైవర్ శశికుమార్ క్యాబిన్‌లో ఇరుక్కు పోయి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న వెల్దుర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీసి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. హెడ్ కానిస్టేబుల్ మద్దిలేటి ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ మద్దిలేటి తెలిపారు.