క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, జూన్ 3: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లికి చెందిన ఎలిగాల లక్ష్మమ్మ (56) జాతీయ రహదారి పక్కగా నడుస్తుండగా సూర్యాపేట నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు అతివేగంగా దూసుకొచ్చి ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.
ఈతకు వెళ్లి యువకుని మృతి
మద్దిరాల, జూన్ 3: ఈతకు వెళ్లి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన ఆదివారం మండలకేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మండలకేంద్రానికి చెందిన వల్లపు రమేష్ (21) మధ్యాహ్నం నిద్రిస్తున్న సమయంలో తన స్నేహితులు శేరి నితిన్, మహేష్, ఉమేష్‌లు ఈతకు వెళ్లాద్దమని మండలపరిధిలోని కుంటపల్లి గ్రామంలోని వ్యవసాయ బావి వద్దకు తీసుకువెళ్లి ఈత వచ్చిన తన కుమారుడిని బావిలో ముంచి చంపారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తల్లి వల్లపు యల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్సై యాదగిరి తెలిపారు.