క్రైమ్/లీగల్

అనుమానంతో చంపేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 3: చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. తల్లీ బిడ్డను అతి కిరాతకంగా కత్తితో నరికి చంపి తర్వాత ఆత్మహత్యకు పాల్పడిన ప్రియుడి సంఘటన చిత్తూరు రూరల్ మండలం మర్రిగుంటలో శనివారం అర్థరాత్రి చోటుచేసుకొంది. అనుమానమే పెనుభూతమై ఘోరానికి దారితీసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. చిత్తూరు రూరల్ మండలం తొప్పాతిపల్లి పంచాయతీ మర్రిగుంట గ్రామానికి చెందిన పురుషోత్తం (35), గంగవరం మండలానికి చెందిన వనితకు (32) సుమారు 11ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో నాలుగేళ్ల క్రితం పురుషోత్తం గ్రామంలో ఆత్యహత్య చేసుకున్నాడు. ఈనేపథ్యంలో వనితకు, అదే గ్రామానికి చెందిన భరత్‌కుమార్ (21) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే భరత్‌కుమార్‌కు వివాహం చేయాలని అతని కుటుంబీకులు ప్రయత్నిస్తున్నా అందుకు నిరాకరిస్తూ వస్తున్నాడు. ఈక్రమంలో వనిత ప్రవర్తనపై అనుమానం పెట్టుకొన్న భరత్ పలుమార్లు ఈవిషయంగా ఇరువురు గొడవపడినట్లు సమాచారం. వేసవి సెలవులు కావడంతో వనిత పెద్దకుమార్తె తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా, చిన్నకొడుకు మహేంద్రన్ (7)తో కలిసి గ్రామంలోనే ఉంటోంది. ఈక్రమంలో శనివారం రాత్రి వనిత, ఆమె కుమారుడు మహేంద్ర ఇంట్లో నిద్రస్తుండగా భరత్‌కుమార్ వెళ్లి ఆమెతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరడంతో ఆగ్రహానికి లోనైన భరత్‌కుమార్ అక్కడేవున్న కత్తితో తల్లీకొడుకును అతి కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం రక్తపుమరకలైన కత్తిని, చేతులను శుభ్రంగా కడుక్కొని తాను తాడుతో అక్కడే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం వనిత ఇంటి వద్ద భరత్‌కుమార్ ఉరి వేసుకుని ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం ఇంటిని పరిశీలించగా ఇంట్లో తల్లీ బిడ్డలు విగతజీవులై పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలాన్ని చిత్తూరు ఏఎస్పీ రాధిక, డీఎస్పీ
సుబ్బారావు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తల్లీ బిడ్డను భరత్‌కుమారే చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ సుబ్బారావు తెలిపారు.

చిత్రం..మర్రిగుంటలో హత్యకు గురైన తల్లీకొడుకు, ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ప్రియుడు