క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి, భార్యకు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, జూన్ 3: వయస్సుకు మించిన వేగం, వాహనాన్ని అదుపు చేయలేని చిన్న తనం వెరసి భార్య కళ్ల ముందే భర్త ప్రాణాలు బలయ్యాయి. భర్త వద్దకు వెళ్లి ఆయన్ని హత్తుకుని ఏడవాలన్నా సహకరించని విరిగిన కాలు ఆ భార్య మనోవేదన వర్ణాతీతం. ముగ్గురు పిల్లలకు తండ్రిని దూరం చేసిన ఈ విషాధ సంఘటన ఆదివారం సాయంత్రం పాతబస్తీ సాయిరామ్ థియేటర్ సెంటర్‌లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సాయిరామ్ థియేటర్ సెంటర్‌లో నివాసముంటున్న తటవ వెంకటేశ్వరరావు (40), కల్పన (30) దంపతులు. హనుమాన్ జంక్షన్‌లోని ఓ వైద్యుని వద్దకు వెళ్లి ఆదివారం సాయంత్రం ఇంటి ముఖం పట్టారు. సిటీబస్ దిగి రోడ్డు దాటుతుండగా బజాజ్ డిస్కవరీ మోటార్ సైకిల్ అత్యంత వేగంగా మృత్యువులా దూసుకొచ్చింది. దంపతులను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య కల్పన కౌలు విరిగింది. సమాచారం అందిన కొత్తపేట ఎస్‌ఐ ఎన్‌ఎల్‌ఎన్ మూర్తి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన మైనర్ బాలుడిని, మోటారు వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును ఎస్‌ఐ మూర్తి దర్యాప్తు చేస్తున్నారు.