క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జూన్ 3: మొవ్వ మండలం పెదపూడి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటారు సైక్లిస్ట్ అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. కూచిపూడి ఎస్‌ఐ పెద్దిరెడ్డి సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుడ్లవల్లేరు మండలం చిత్రం గ్రామానికి చెందిన దారపు మధు (40) మొవ్వ మండలం కొండవరం గ్రామంలోని అత్త గారింటికి వెళ్లి తిరిగి స్వగ్రామం వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కూచిపూడి ప్రధాన కూడలి దాటిన తర్వాత ముందుగా వెళుతున్న ఏపి 26ఎక్స్ 1859 నెంబరు గల లారీని ఓవర్ టేక్ చేయబోయి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో మధు అక్కడిక్కడే మృతి చెందాడు. తలకు హెల్మెట్ పెట్టుకున్నా హెల్మెట్‌తో సహా మదు శిరస్సు నుజ్జునుజ్జు అయ్యింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సురేష్ ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.