క్రైమ్/లీగల్

కారును ఢీ కొన్న ప్రైవేట్ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బి.మఠం, జూన్ 5: మండలంలోని మైదుకూరు-బద్వేలు జాతీయ రహదారి నందిపల్లె దొడ్ల డైరీ సమీపంలో మంగళవారం తెల్లవారు ఝామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారుపై దూసుకెళ్ళడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. బి.మఠం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను కడప రిమ్స్‌కు తరలించారు. పోలిసుల కథనం మేరకు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రను తిలకించేందుకు పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్తలు ప్రైవేట్ ట్రావెల్స్‌ను అద్దెకు తీసుకుని తూర్పు గోదావరి జిల్లాకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి కారులో గుంటూరు జిల్లాకు వెళ్తున్న వెంకటసత్య సూర్యశివ నాగేంద్రశర్మ (49), జాలాది బాబు (22), సాలెం రాజు (23) అనే వారు వస్తున్నారు. బస్సు డ్రైవర్ బస్సును నిద్రమత్తులో అదుపుతప్పి కారుమీదికి తీసుకెళ్లడంతో కారు నుజ్జునుజ్జు అయ్యి అందులో వున్న ముగ్గరూ అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు కూడా రోడ్డు దిగి సుమారుగా వెళ్ళిపోయింది. బస్సులో వున్న ప్రయాణికులు కూడా భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలానికి మైదుకూరు సీఐ హనుమంత్‌నాయక్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.