క్రైమ్/లీగల్

అంతరాష్ట్ర పార్థీ గ్యాంగ్ మహిళల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, జూన్ 5: మొన్న దండుపాళెం, నిన్న చెడ్డీ గ్యాంగ్, నేడు పార్థీ గ్యాంగ్‌లు దోపీడీలు, దొంగతనాలతో ప్రజలను కంటి మీద కునుకు లేకుండా బెంబేలెత్తిస్తున్నాయి. అయితే నిన్నటి వరకు పోలీసులు గ్యాంగ్‌లు ఏవీ లేవని అన్ని అపోహలే అంటూ గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. సోమవారం సాయంత్రం రాజంపేట రైల్వేస్టేషన్‌లో మహారాష్టక్రు చెందిన పార్థిగ్యాంగ్‌కు చెందిన ఇరువురు మహిళలను రాజంపేట పోలీసులు అరెస్టు చేయడంతో నగరాలకే పరిమితమైన వీరి చర్యలు జిల్లా, మున్సిపల్ స్థాయికి కూడా విస్తరించినట్టు ప్రస్తుతం పోలీసులు బాహాటంగా చెప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్నటి వరకు పార్థివ్ గ్యాంగ్ కార్యకలాపాలే లేవన్న పోలీసులు తాజాగా పార్థివ్ గ్యాంగ్‌కు చెందిన ఇరువురు మహిళలను అరెస్టు చేయడం స్థానికంగా సంచలనం కలిగిస్తున్నది. దీనిని బట్టి పార్థివ్ గ్యాంగ్ కార్యకలాపాలు కడప జిల్లాలో కూడా కొనసాగినట్టు భావించాల్సి వస్తోంది. మంగళవారం రాజంపేట డీఎస్పీ బి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అంతరాష్ట్ర పార్థి గ్యాంగ్ మహిళల వివరాలను వెల్లడించారు. సికింద్రాబాద్, లాలాగూడా, తుకారాంగేట్ వద్ద నివసించే పార్థివ్ ఉప్పాడే రూపా (30), పార్థివ్ ఉప్పాడే సరస్వతి (25) స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని సరస్వతిపురం వద్ద అరెస్టు చేసినట్టు చెప్పారు. స్థానిక అర్బన్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ వీరు వీధుల్లో పాత సామాన్లు కొందామంటూ, చిక్కు వెంట్రుకలు కొందామంటూ వీధుల్లో సంచరిస్తూ ఇళ్లకు తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి, మహిళలే గడ్డపారలతో, రాడ్లతో బీగాలు పగలగొట్టి ఆ ఇంట్లో విలువైన వస్తువులు కాజేస్తారన్నారు. వీరు ఎక్కువగా రైల్వే సమీపంలో ఉన్న గ్రామాల్లోనే రెక్కీ నిర్వహిస్తూ దోపీడీలకు పాల్పడతారన్నారు. అంతేకాకుండా ఈ గ్యాంగ్ లీడర్ పార్థివ్ జ్యోతీ పలు దొంగతనాలకు ప్రణాళిక వేసి తమ గ్యాంగ్ సభ్యులచే దోపీడీలకు పాల్పడడం, అనంతరం స్వగ్రామాలకు చేరుకోవడం జరుగుతూ ఉంటుందన్నారు. గతంలో రాజంపేట పట్టణంలోని టి.అగ్రహారంకు చెందిన శింగనమల లక్ష్మీదేవి ఇంటిలో, కొలిమివీధిలోని ఎల్.శ్రీనివాసులు ఇంట్లో దోపిడీలకు పాల్పడినట్టు చెప్పారు. వారి వద్ద నుండి రూ. 4లక్షలు విలువ చేసే 123.724 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పార్థివ్ గ్యాంగ్‌కు చెందిన మహిళలు అరెస్టు అయిన విషయం తెలిసిన వెంటనే రాజంపేట పట్టణంలో అన్ని వర్గాల ప్రజల్లో భయాందోళనలు రెకెత్తించింది. ఇప్పటికే పోలీసులు చోరీలు అదుపుకు పట్టణంలో అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరిచే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకోవడమే కాకుండా, ఇళ్ల ల్లో లేని సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ప్రజల్లో అవగాహనకు చర్యలు తీసుకోవడం జరిగింది. కాగా పార్థివ్ గ్యాంగ్ మహిళల అరెస్టుతో ఈ గ్యాంగ్ కారకలాపాలపై మరింత లోతుగా పోలీసులు ముమ్మర దర్యాప్తు మొదలెత్తారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసులను కూడా నియమించినట్టు తెలుస్తుంది. రాజంపేటలో పోలీసులు అరెస్టు చేసిన పార్థివ్ గ్యాంగ్ వివరాలు పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్టు అయిన పార్థివ్ ఉప్పాడే రూపా మహారాష్ట్ర దాదర్ సిటీ రైల్వేస్టేషన్ సమీపాన గల గ్రామంలో ఉండేది. చిన్నతనం లోనే తల్లిదండ్రులు చనిపోగా, చిన్నాన నారాయణ్, పిన్ని అరుణ పెంచి పెద్ద చేశారు. వీరు కూడా 8 ఎళ్ల క్రితం చనిపోవడంతో రూపా 12 ఏళ్ల క్రితం అవినాష్ అనే అతనిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు భరత్, ఒక కుమార్తె భారతి సంతానం కలిగారు. భర్త అవినాష్ వ్యసనాలకు బానిసై ఏ పని చేయకుండా ఇంటి వద్దనే సోమరిగా ఉంటూ కొడుతూ తిడుతూ వేదిస్తూ రూప సంపాదనపై ఆధారపడ్డారు. దీంతో కుటుంబ పోషణ భారంతో బాధలు భరించలేక ఎలాగైనా ఇళ్లు వదలి వెళ్ళిపోవాలని రూపా ఆలోచించింది. ఈ క్రమంలో చిన్నాయన కూతురు సరస్వతి కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్లి బతకాలని నిర్ణయించుకున్నారు. ఒకటిన్నర సంవత్సరం క్రితం వీరు పిల్లలతో దాదర్ వదలి సికింద్రాబాద్‌కు చేరుకున్నారు. బతుకుదెరువు కోసం స్టీల్ సామాన్లు, చిక్కు వెంట్రుకలు అమ్ముకుంటూ జీవనం సాగించడం మొదలెత్తారు. ఆ క్రమంలో వీరికి పార్థివ్ జ్యోతి అనే లీడర్ పరిచయం అయ్యింది. జ్యోతి వీరికి దూరపు బంధువు కూడా కావడంతో ఆమెతో వీరు మరింత దగ్గరయ్యారు. పాత సామాన్లు అమ్ముకుంటూ వచ్చిన సంపాదన కుటుంబ పోషణకు, విలాసాలకు సరిపడక, రైల్వేస్టేషన్ సమీపాన గల గ్రామాల్లో తిరుగుతూ జ్యోతి సూచనలతో వీరు దోపిడీలు మొదలెత్తారు. పార్థివ్ ఉప్పాడే సరస్వతి
అరెస్టు అయిన మరో పార్థివ్ గ్యాంగ్‌కు చెందిన మహారాష్ట్ర దాదర్ పట్టణానికి చెందిన పార్థివ్ ఉప్పాడే సరస్వతి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి తల్లి అరుణ సంరక్షణలో పెరిగింది. పెద్దనాన కూతురు రూపాతో చిన్నతనం నుండి సరస్వతికి సన్నిహిత సంబంధాలున్నాయి. సరస్వతి తల్లి 6 సంవత్సరాల క్రితం ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తరువాత సుమారు విక్కి అనే అతనిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తరువాత సరస్వతి, రూపతో కలిసి ఊరు వదలి వచ్చి హైదరాబాద్, లాలాగూడ, సికింద్రాబాద్ ఏరియాల్లో దొంగతనాలు చేసి పార్థివ్ గ్యాంగ్‌లో కొనసాగుతోంది. కాగా పార్థివ్ గ్యాంగ్ మహిళలను అరెస్టు చేసిన రాజంపేట రూరల్ సీఐ నరశింహులు, ఎస్‌ఐ రాజగోపాల్, సిబ్బంది భాషా, విజయలక్ష్మీ, రమేష్, చంద్రానాయక్, శ్రీనివాసులు, విజయభాస్కర్, రాజేశ్వరయ్య, సుధాకర్, ప్రసాద్, చలపతి, కల్పన, సుబ్బలక్ష్మీలను డీఎస్పీ లక్ష్మీనారాయణ అభినందించారు.