క్రైమ్/లీగల్

ముగ్గురు ఎచ్రందనం స్మగ్లర్లు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 5: చిత్తూరు జిల్లా వెదుకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగుంట క్రాస్ వద్ద సోమవారం అర్ధరాత్రి వాహనాలు తనిఖీలో భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎ ఎస్పీ రాధిక కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెదురుకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుపతి-పచ్చికాపలం రోడ్డు మార్గంలో సోమవారం అర్ధరాత్రి పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు బొలెరో వాహనాలు ఆగకుండా వెళ్లడంతో అనుమానంతో పోలీసులు వెంబడించి ఆ వాహనాలను స్వాధీనం చేసుకొని తనిఖీ చేయగా అందులో 2.6టన్నులు బరువు గల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సత్యవేడు సమీపంలోని తమిళనాడు రాష్ట్రం బూడూరు గ్రామం వద్ద దేవకుమార్‌కు చెందిన గోడౌన్‌ను తనిఖీ చేయగా అందులో నిల్వ వున్న ఒకటన్ను బరువు ఉన్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ రెండు బొలెరో వాహనాల్లో శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను సేకరించి ఈ గోడౌన్‌లో నిల్వ చేయడానికి తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. బూడుగూరు గోడౌన్ వద్ద కాపలాగా ఉన్న సత్యవేడుకు చెందిన వెంకటేష్‌ను, గత కొంత కాలంగా ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్న అదే మండలం రాజుకుంట గ్రామానికి చెందిన మహేంద్రను, మురళిలను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. మురళి కూడా గత కొంతకాలంగా ఎర్రచందనాన్ని అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. తమిళనాడు రాష్ట్రం బూడుగూరు గ్రామంలోని గోడౌన్ యజమాని దేవకుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు ఎఎస్పీ తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఇటీవల ఇంత భారీ స్థాయిలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతోపాటు ముగ్గురు స్మగ్లర్లను పట్టుకున్న ఘటనలో కీలకపాత్ర వహించిన పోలీస్ సిబ్బందికి రివార్డు అందించినట్లు తెలిపారు.

వడదెబ్బకు ఒకరు మృతి
వరదయ్యపాళెం, జూన్ 5: మండలంలోని రామిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన గుణకల వెంకటరామయ్య (46) వడదెబ్బకు గురై మంగళవారం మృతిచెందారు. సోమవారం పనులు చేయడానికి పొలానికి వెళ్లిన వెంకటరామయ్య వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.