క్రైమ్/లీగల్

ఆటో డ్రైవర్ కిరాయికి రాలేదని హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజోలు, జూన్ 5: సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో ఆటో డ్రైవర్ కిరాయికి పిలిస్తే రాలేదని ముగ్గురు వ్యక్తులు డ్రైవర్‌ను కొట్టి చంపేశారు. వివరాల్లోకి వెళితే... మోరి గ్రామానికి చెందిన పిల్లి దుర్గాప్రసాద్ (26) రాత్రి 11.00 గంటల సమయంలో ఇంటి వద్ద ఉండగా అదే గ్రామానికి చెందిన గిరిసాల కిషోర్, గిరిసాల మురళీ, వలవల వీరకణం వచ్చి అంతర్వేదిపాలెం కిరాయికి వెళ్లాలి రమ్మని పిలిచారు. అయితే దుర్గాప్రసాద్ తనకు జ్వరంగా ఉందని, రాలేనని చెప్పడంతో ఆగ్రహించి విచక్షణారహితంగా కాలుతో తన్ని కింద పడేశారు. అడ్డువచ్చిన స్థానికులు, కుటుంబ సభ్యులను కూడా గెంటేశారు. దుర్గాప్రసాద్ గాయాలపాలై సొమ్మచిల్లి పడిపోయాడు. రాత్రి ప్రాథమిక చికిత్స అందించి ఉదయం రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. మృతునికి యేడాది క్రితం కులాంతర వివాహం అయింది. ప్రస్తుతం దుర్గాప్రసాద్ భార్య గర్భవతి, దుర్గాప్రసాద్ సోదరుడు ఫిర్యాదు మేరకు సఖినేటిపల్లి ఎస్సై ఎం పవన్‌కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో యూనియన్ నాయకుల రాస్తారోకో
ఆటో యూనియన్ కార్మికుడు దుర్గాప్రసాద్‌ను చంపినవారిని తక్షణమే అరెస్టుచేసి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని రాజోలు ఆటో యూనియన్ నాయకులు రాజోలు ప్రభుత్వాసుపత్రి ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సుమారు 3 గంటల పాటు వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు హామీ ఇస్తేనే రాస్తారోకో విరమిస్తామని పట్టుబట్టారు. ఈ కార్యక్రమంలో గంటే రత్నరాజు, అడబాల కన్నా, పితాని సురేంద్ర, పిహెచ్ రాము, జీ నాగరాజు, జవ్వాది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.