క్రైమ్/లీగల్

నకిలీ గోధుమ పిండి పోలీసుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూన్ 5: ఆశీర్వాద్ గోధుమ పిండి పేరుతో నకిలీ పిండి తయారీ కేంద్రంపై బాలానగర్ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. కాప్రా, ఊర్లశంకరమ్మ కాలనీకి చెందిన నారాయణరెడ్డి కుమారుడు తాతిరెడ్డి ఇంద్రారెడ్డి (50), సైనిక్‌పురికి చెందిన ఆంజనేయులు (50)లు కలిసి దేవరయాంజాల్ గ్రామంలో ఎస్‌వీఆర్ ఎస్టేట్‌లో ఓ గోడౌన్‌ను నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల నుండి నాణ్యత లేని గోధుమ పిండిని తీసుకువచ్చి ఆశీర్వాద్ గోధుమ పిండి పేరుతో మార్కెట్‌లో సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సమాచారం అందుకున్న బాలానగర్ జోన్ ఎస్‌ఓటీ పోలీసుల బృందం ఎస్‌వీఆర్ ఎస్టేట్‌పై దాడి చేసి రూ.7.50 లక్షల విలువ చేసే 5 కిలోల పిండి బ్యాగులు, 30 లక్షలు విలువ చేసే మిషనరీని స్వాధీన పరుచుకున్నారు. ఈమేరకు ఎస్‌ఓటీ పోలీసులు నిర్వాహకుడు ఇంద్రారెడ్డిని అరెస్ట్‌చేసి పేట్‌బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కల్తీ ఐస్‌క్రీంలు
నేరేడ్‌మెట్, జూన్ 5: నిబంధనలకు విరుద్ధంగా వివిధ రకాల బ్రాండ్‌ల పేరుతో కల్తీ ఐస్‌క్రీమ్‌లు ఇంట్లో తయారు చేస్తున్న వ్యక్తిని మల్కాజిగిరి ఎస్‌వోటి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎస్‌వోటి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ మల్కాజిగిరిలో నివసించే బద్రీలాల్(51) ఎలాంటి అనుమతులు లేకుండా తన ఇంట్లో వివిధ రకాల కంపెనీలకు చెందిన ఐస్‌క్రీమ్‌లను తయారుచేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాడని తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం అతని ఇంటిపై దాడిచేసి ఐస్‌క్రీమ్ తయారీకి ఉపయోగిస్తున్న ముడిసరుకు, ప్యాకింగ్ కవర్లు సీజ్ చేసినట్టు తెలిపారు.