క్రైమ్/లీగల్

మహిళ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదిగుబ్బ, జూన్ 7: మండల పరిధిలోని యస్.బ్రాహ్మణపల్లిలో బుధవారం సాయంత్రం అశ్వని (24) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భర్త నాగేంద్ర, అత్తమామలు వేరుశెనగ విత్తన కాయలకు వెళ్లగా అశ్వని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వ్యవసాయ పనులు ముగించుకొని వచ్చిన భర్త నాగేంద్ర చూడగా అప్పటికే అశ్వని మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని పంచనామ నిమిత్తం గురువారం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నట్లు ఏఎస్‌ఐ రహీం తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సివుంది.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
విడపనకల్లు, జూన్ 7 : మండల పరిధిలోని డోనేకల్లు గ్రామంలో గురువారం విద్యుదాఘాతంతో గవిసిద్దప్ప(60) మృతి చెందాడు. బాధితులు తెలిపిన వివరాల మేరకు గవిసిద్దప్ప కొత్తగా నిర్మించిన ఇంటి కోసం క్యూరింగ్ చేసేందుకు విద్యుత్ మోటార్‌ను ఆన్ చేశాడు. అయితే అప్పటికే స్విచ్‌కు విద్యుత్ సరఫరా కావడంతో షాక్ కొట్టి గవిసిద్దప్ప కిందపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు గవిసిద్దప్పను పరిశీలించగా ఆప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

వడదెబ్బతో వ్యక్తి మృతి
పెద్దపప్పూరు, జూన్ 7 : మండలంలోని బత్తాలపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం దూదేకుల నాగేంద్ర(50) వడదెబ్బకు గురై మృతి చెందాడు. ఉదయం అరటి తోటలో పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చాడు. ఆరోగ్యం బాగా లేదని కుటుంబ సభ్యులతో చెప్పడంతో 108 సిబ్బందికి చికిత్స కోసం సమాచారం అందించారు. 108 సిబ్బంది పరిశీలించగా మృతి చెందినట్లు వారు ధృవీకరించారు. నాగేంద్ర కుటుంబాన్ని ఆదుకోవాలని మండల ఉపాధ్యక్షుడు గుత్తి శ్రీనివాసులు, గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరారు.