రాష్ట్రీయం

నిధుల వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది తెలంగాణకు డబ్బే డబ్బు
పన్ను బకాయిలు రూ.4 వేల కోట్లు
ఎఫ్‌ఆర్‌బిఎం నుంచి రూ.3 వేల కోట్లు
భూముల అమ్మకంతో రూ.3 వేల కోట్లు
క్రమబద్ధీకరణతో రూ.2 వేల కోట్లు
జీవో 59 ద్వారా రూ.1350 కోట్లు
కాకతీయకు నాబార్డు రుణం 5వేల కోట్లు
భగీరథకు హడ్కోనుంచి 10 వేల కోట్లు
ఇళ్ల పథకానికి హడ్కో లోను 2.5వేల కోట్లు
ఇక పంట రుణాలు పూర్తిగా మాఫీ?

హైదరాబాద్, డిసెంబర్ 6: దేశంలో మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రాల్లో ద్వితీయ స్థానం సంపాదించుకున్న తెలంగాణకు ఈ ఏడాది నిధుల వరద తాకబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలకు వాణిజ్య బాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలిచ్చేందుకు పోటీపడుతున్నాయి. ప్రభుత్వం నేరుగా రుణం పొందడానికి ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం కొంతవరకు మాత్రమే పరిమితి కలిగి ఉంది. ఈ నిబంధనను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రుణాన్ని తీసుకోకుండా ప్రాధాన్యత పథకాల అమలుకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, అవి తీసుకోబోయే రుణానికి బ్యాంకు గ్యారంటీ ఇవ్వడం ద్వారా ఎంతైనా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం వినియోగించుకుంటోంది. దీనివల్ల కార్పొరేషన్లు ఎంత మొత్తం రుణాన్నైనా తీసుకునే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే వాటర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు హడ్కోనుంచి 10 వేల కోట్ల రుణం మంజూరుకాగా, ఇందులో రూ.2500 కోట్లను ఇప్పటికే మంజూరు చేసింది. అలాగే మిషన్ కాకతీయకు నాబార్డు రూ.5000 కోట్ల రుణం మంజూరు చేసి, ఇప్పటికే రూ.500 కోట్లు విడుదల చేసింది. పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించేందుకు చేపట్టిన పథకానికీ హడ్కో రుణం ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ పథకాన్ని చేపట్టిన హౌసింగ్ కార్పొరేషన్‌కు ఇటీవల హడ్కో రూ.2750 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ పథకానికి పెట్టుబడి పెట్టడానికి చైనాకు చెందిన బ్యాంకు కూడా ముందుకొచ్చింది. ఇలావుంటే, ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు 3 శాతం వరకు రుణాన్ని పొందేందుకు అవకాశం ఉంది. కాగా మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రాలకు మాత్రం రుణాన్ని పొందేందుకు 3.5 శాతం వరకు అవకాశాన్ని నీతి అయోగ్ కల్పించింది. దీంతో రాష్ట్రానికి రూ.2500 కోట్ల నుంచి 3000 కోట్ల రుణాన్ని అదనంగా పొందడానికి అవకాశం ఏర్పడింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా జనవరి లేక ఫిబ్రవరికల్లా రాష్ట్రానికి అదనంగా రుణం పొందబోతుంది. తాజాగా కాళేశ్వరం- ప్రాణహిత నీటి పారుదల ప్రాజెక్టుకు ఎల్‌ఐసి కూడా పెద్దమొత్తంలో రుణం ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. వారం రోజుల్లో ఎల్‌ఐసి ఉన్నతాధికారులతో చర్చలు జరపడానికి నీటిపారుదల శాఖ అధికారులు ముంబయికి వెళ్లనున్నారు. వాణిజ్య పన్నుల బకాయిలు సుమారు రూ.8000 కోట్ల వరకూ ఉన్నాయి. ఇందులో కొన్ని సంస్థలు కోర్టులను ఆశ్రయించడంతో రావాల్సిన బకాయిల్లో కనీసం రూ.3500 కోట్ల నుంచి రూ.4000 కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నివాసాలు, ఇతర నిర్మాణాలు నిర్మించుకున్న వారికి వాటిని క్రమబద్ధీకరించడానికి జీవో 59ను తీసుకొచ్చింది. అలాగే జీవో 58కింద పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరించడానికి తీసుకొచ్చిన పథకం పరిధిలోకి రాని దరఖాస్తులను జీవో 59కి బదలాయించారు. వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.1400 కోట్ల మేరకు ఆదాయం సమకూరనుందని ఆర్థికశాఖ లెక్కగట్టింది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం బిల్డింగ్ రెగ్యులరైజేషన్ (బిపిఎస్), లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్‌ఆర్‌ఎస్) పథకాలను ప్రవేశపెట్టింది. వీటిద్వారా ప్రభుత్వానికి కనిష్టంగా రూ.1000 కోట్లు వస్తాయని ప్రాథమికంగా ఆర్థిక శాఖ అంచనా వేసింది. రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వ నిరర్థక భూములను వేలం వేయడం ద్వారా రూ.3000 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో కొన్ని భూములను వేలం వేయగా వాటికి అనూహ్యంగా ధర పలికింది. దీంతో ప్రభుత్వానికి సుమారు రూ.4000 కోట్ల ఆదాయం రానుందని అంచనా వేస్తుంది. వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి విరివిగా రుణాలివ్వడానికి ముందుకు వస్తుండటంతో నిధుల కొరత ఉండదని భావిస్తున్న ప్రభుత్వం, వచ్చే బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు భారీ మొత్తంలో నిధులు కేటాయించాలని భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధుల కొరత ఉండదన్న అంచనతో పంట రుణాలను వచ్చే ఆర్థిక సంవత్సరానికి ముందుగానే మాఫీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.