రాష్ట్రీయం

వరద నష్టం అంచనాకు సిబ్బందిని పంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు సిఎస్ ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 22: నెల్లూరు జిల్లాలో సహాయ పునరావాస కార్యక్రమాల అమలుకు, నష్టాన్ని అంచనా వేసేందుకు అన్ని జిల్లాల నుంచి సిబ్బందిని తక్షణమే పంపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆదివారం నాడు హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కానె్ఫరెన్స్‌లో సిఎస్ మాట్లాడుతూ వరద బాధిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెనూ, వ్యవసాయ, ప్రణాళికా శాఖల సిబ్బందిని నెల్లూరు జిల్లాకు తక్షణమే పంపించాలని ఆదేశించారు. నిత్యావసర వస్తువుల సరఫరా కోసం వాహనాలు సమకూర్చాల్సిందిగా గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి నిత్యావసర వస్తువులను నెల్లూరుకు తక్షణమే చేరవేయాలని అన్నారు.నష్టం అంచనాలను పర్యవేక్షించేందుకు నియమించిన 54 మంది డిప్యూటీ డైరక్టర్లలో 22 మంది ఇప్పటికే విధులకు హాజరయ్యారని, మిగిలిన అధికారులు వెంటనే హాజరయ్యేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పౌరసరఫరాల శాక కమిషనర్ విజయలక్ష్మి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని 1429 చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం పూర్తి స్థాయిలో చేరవేయడం జరిగిందని సిఎస్‌కు వివరించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ జానకి, ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌పి ఠక్కర్ పాల్గొన్నారు.